Balakrishna : బాలకృష్ణ కోసం నన్ను క్రూరంగా మార్చేశారు

‘అఖండ’లో నా లుక్‌ కోసం బోయపాటి శ్రీను ముంబయి నుంచి ప్రత్యేకంగా డిజైనర్లను తీసుకొచ్చారు. ఈ సినిమాలో అత్యంత క్రూరంగా కనిపిస్తాను. బాలకృష్ణకి సరైన ప్రతి నాయకుడిగా కనిపిస్తాను.

Balakrishna : బాలకృష్ణ కోసం నన్ను క్రూరంగా మార్చేశారు

Srikanth

Balakrishna : తెలుగులో సైడ్ క్యారెక్టర్స్ తో, విలన్ క్యారెక్టర్స్ తో ఎంట్రీ ఇచ్చి ఫ్యామిలీ హీరోగా సెట్ అయ్యాడు శ్రీకాంత్. ఆ తర్వాత మధ్యలో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేసాడు. ట్రావెలింగ్ నేపథ్యంలో చేసిన ‘ఇదే మా కథ’ సినిమా రేపు రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ల భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన సంగతులు తెలియచేసారు. ఇప్పుడు విలన్ గా తన రెండో ఇన్నింగ్స్ ని మొదలు పెట్టబోతున్నాను అని తెలిపాడు.

ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ’ సినిమాలో విలన్ గా నటిస్తున్నాను అని చెప్పారు. ‘అఖండ’లో నా లుక్‌ కోసం బోయపాటి శ్రీను ముంబయి నుంచి ప్రత్యేకంగా డిజైనర్లను తీసుకొచ్చారు. ఈ సినిమాలో అత్యంత క్రూరంగా కనిపిస్తాను. బాలకృష్ణకి సరైన ప్రతి నాయకుడిగా కనిపిస్తాను. ఆ అత్యంత క్రూరమైన లుక్‌ ని చూసుకున్నాక మహిళా ప్రేక్షకులు నన్ను తిడతారేమో అనుకుంటున్నాను. ఈ సినిమాలో విలన్‌గా చేయడానికి ముందు చాలా ఆలోచించాను. ఎందుకంటే ‘శ్రీరామరాజ్యం’లో లక్ష్మణుడిగా బాలకృష్ణ పక్కన చేశాను. ఇప్పుడాయన పక్కన ఇంత క్రూరమైన పాత్రలో కనిపిస్తే బాగుంటుందా అని అనుకున్నాను. ఇదే విషయాన్ని బాలయ్య బాబుతో చెప్తే ‘ఇలాంటి పాత్రలే చెయ్యాలి’ అని అన్నారు. దీని తర్వాత చాలా పాత్రలొస్తాయి ఏది పడితే అది చేయకని సలహా ఇచ్చారని తెలిపారు శ్రీకాంత్.

BiggBoss 5 : బిగ్ బాస్ లో కొత్త కెప్టెన్.. అతన్ని ఎందుకు చేసారంటూ ఫైర్..

‘అఖండ’ తర్వాత రామ్‌చరణ్‌, శంకర్‌ కలయికలో రాబోతున్న చిత్రంలో కూడా విలన్‌గా నటిస్తున్నాను అని తెలిపారు. ఇక తన తనయుడు రోషన్‌ రాఘవేంద్రరావు చేతుల మీదుగా ‘పెళ్లి సందడి’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన చేతుల మీదుగా ఎంతో మంది పెద్ద హీరోలు పరిచయమయ్యారు. ఇప్పుడా అవకాశం రోషన్‌కు రావడం వాడి అదృష్టం అని వ్యాఖ్యానించారు.