BiggBoss 5 : బిగ్ బాస్ లో కొత్త కెప్టెన్.. అతన్ని ఎందుకు చేసారంటూ ఫైర్.. | Biggboss new captain

BiggBoss 5 : బిగ్ బాస్ లో కొత్త కెప్టెన్.. అతన్ని ఎందుకు చేసారంటూ ఫైర్..

కెప్టెన్ ని ఎన్నుకునేందుకు 'కత్తులతో సావాసం' అనే ఒక కెప్టెన్సీ టాస్క్‌ని బిగ్ బాస్ నిర్వహించాడు. ఈ టాస్క్ లో హౌస్‌మేట్స్‌ కెప్టెన్‌కు అర్హులు కారు అనుకున్నవారిని వారికి ఉన్న

BiggBoss 5 : బిగ్ బాస్ లో కొత్త కెప్టెన్.. అతన్ని ఎందుకు చేసారంటూ ఫైర్..

BiggBoss 5 :  బిగ్ బాస్ షో రోజు రోజుకి హీట్ ఎక్కుతుంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, గ్రూపులుగా విడిపోవడాలు జరుగుతున్నాయి. ఇక ప్రతి వారం జరిగే కెప్టెన్సీ టాస్క్ లో ఈ వివాదాలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో మళ్ళీ కంటెస్టెంట్స్ మధ్య విబేధాలు తలెత్తాయి.

అంతకు ముందు బరువు తగ్గాలి అనే కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌లో సన్నీ-మానస్‌, హమీదా- శ్రీరామచంద్ర, యానీ మాస్టర్‌- శ్వేత జంటలు ఎక్కువ బరువు తగ్గాయి. ఈ జంటల్లో నుంచి ఒక్కొక్కరు కెప్టెన్సీకి పోటీ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్‌ తెలిపాడు. దీంతో ఈ మూడు జంటల నుంచి శ్రీరామచంద్ర, శ్వేత, సన్నీలు కెప్టెన్సీ పదవికి పోటీ చేశారు. కెప్టెన్ ని ఎన్నుకునేందుకు ‘కత్తులతో సావాసం’ అనే ఒక కెప్టెన్సీ టాస్క్‌ని బిగ్ బాస్ నిర్వహించాడు. ఈ టాస్క్ లో హౌస్‌మేట్స్‌ కెప్టెన్‌కు అర్హులు కారు అనుకున్నవారిని వారికి ఉన్న బెల్ట్‌ను కత్తితో పొడవాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఎవరికి తక్కువ కత్తులు ఉంటే వారే కెప్టెన్ అన్నాడు.

Bahubali : బాహుబలి వెబ్ సిరీస్ ఆగిపోయిందా??

కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్న ఈ ముగ్గురు ఎలక్షన్స్ లాగా మేము గెలిస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని వాగ్దానాలు చేశారు. కెప్టెన్ గా గెలిపించండి అని పేరు పేరునా అభ్యర్థించారు. సన్నీ మాట్లాడుతూ.. నేను కెప్టెన్‌ డ్రెస్‌ తెచ్చుకున్నాను, అది వేసుకోవడానికైనా నన్ను గెలిపించండని అని అందర్నీ బతిమాలుకున్నాడు. శ్రీరామ్‌ మాత్రం.. మీకు ఎవరు కరెక్ట్‌ అనిపిస్తే వారికే ఓటేయండని, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తను సాల్వ్‌ చేస్తానని చెప్పాడు. శ్వేత మాట్లాడుతూ.. తను కెప్టెన్‌ అయితే హౌస్‌ స్ట్రిక్ట్‌గా మారుతుందని హెచ్చరిక చేసింది.

Anchor Suma : అలాంటి వాళ్లలో మా ఆయన ఒకరు..

ఇక టాస్క్ స్టార్ట్ అవ్వగానే హౌస్‌మేట్స్‌ ఒక్కొక్కరు వచ్చి వాళ్ళకి ఇచ్చిన కత్తులు కెప్టెన్ వద్దు అనుకున్న వాళ్లకి గుచ్చారు. ఫస్ట్ విశ్వ వచ్చి సన్నీ బెల్ట్‌కు కత్తి గుచ్చాడు. తర్వాత షన్ను మన మధ్య అంత ర్యాపో లేదంటూ మళ్లీ సన్నీకే కత్తి గుచ్చాడు. తర్వాత సిరి కూడా సన్నీకే గుచ్చింది. నీకింకా కెప్టెన్‌ అయ్యే టైం రాలేదంటూ లోబో కూడా సన్నీని కత్తితో గుచ్చాడు. తర్వాత నటరాజ్ మాస్టర్, రవి, ప్రియాంక కూడా సన్నీకి కత్తులు గుచ్చారు.

హమీదా, మానస్, కాజల్ లు శ్వేతను కెప్టెన్ గా వద్దంటూ శ్వేతా బెల్ట్ కి కత్తులు గుచ్చారు. యానీ మాస్టర్‌, జెస్సిలు శ్రీరామ్‌ను కత్తితో పొడిచారు. మొత్తంగా శ్రీరామ్ కే తక్కువ కత్తి పోట్లు పడ్డాయి. ఇలా తక్కువ కత్తిపోట్లు పడ్డ శ్రీరామ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో నాలుగో కెప్టెన్‌గా అవతరించాడు. అయితే శ్రీరామ్ కెప్టెన్ అవ్వడం తాను ఓడిపోవడం సన్నీకి బాధ కలిగించింది. దీంతో శ్రీరామ్‌కు ఎలా సపోర్ట్ చేశారో నాకు అర్ధం కావట్లేదు అని ఆవేశపడ్డాడు.

×