Bahubali : బాహుబలి వెబ్ సిరీస్ ఆగిపోయిందా??

దీంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ బడ్జెట్ తో బాహుబలి సిరీస్ తీయడానికి సిద్ధమైంది. ప్రముఖ ర‌చ‌యిత ఆనంద్ నీల‌కంఠ‌న్ రాసిన ‘ది రైజ్ ఆఫ్ శివ‌గామి' నవల ఆధారంగా బాహుబలి సిరీస్ ని

Bahubali : బాహుబలి వెబ్ సిరీస్ ఆగిపోయిందా??

Bahubali

Bahubali : తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి. ఈ సినిమా తెలుగు మార్కెట్ ని పెంచింది. ఇండియాలో కూడా రెండు వేల కోట్ల కలెక్షన్స్ విడుదల చేసే సినిమాలు వస్తాయని ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో మార్కెట్ కోసం చూస్తున్న నెట్ ఫ్లిక్స్ భారత నేటివిటికి తగ్గట్టు అన్ని భాషల్లోనూ ఇక్కడి నటీనటులు దర్శకులతో వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తుంది. అంతే కాక ఇక్కడి లోకల్ సినిమాలకి భారీ అమౌంట్స్ ఆఫర్ చేసి డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కి ట్రై చేస్తుంది. దీంట్లో భాగంగానే నెట్ ఫ్లిక్స్ బాహుబలి వెబ్ సిరీస్ ని ప్లాన్ చేసింది.

ఇందుకు రాజమౌళిని కూడా సంప్రదించింది. రాజమౌళి డైరెక్షన్ తాను చేయకపోయినా తన మద్దతు ఉంటుందని తెలిపారు. దీంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ బడ్జెట్ తో బాహుబలి సిరీస్ తీయడానికి సిద్ధమైంది. ప్రముఖ ర‌చ‌యిత ఆనంద్ నీల‌కంఠ‌న్ రాసిన ‘ది రైజ్ ఆఫ్ శివ‌గామి’ నవల ఆధారంగా బాహుబలి సిరీస్ ని ఎక్కువ ఎపిసోడ్లు తీయాలని అనుకున్నారు. ఈ సిరీస్ కి దర్శకుడిగా దేవకట్టాని తీసుకోమని రాజమౌళి తెలిపారు. దేవాకట్టా బాహుబలి సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు. దీనికి నెట్ ఫ్లిక్స్ కూడా ఓకే చెప్పింది. కొన్ని ఎపిసోడ్స్ కి ప్రవీణ్ సత్తారుని కూడా డైరెక్టర్ గా సెలెక్ట్ చేశారు.

Anchor Suma : అలాంటి వాళ్లలో మా ఆయన ఒకరు..

‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ తరహాలో ఈ బాహుబలి సిరీస్ ఉండాలని ప్రణాళికలు వేశారు. ఒక సీజన్ స్క్రిప్టు వర్క్ కూడా కంప్లీట్ చేశారు. దేవాకట్టా ప్రవీణ్ సత్తారు కలిసి రాజమౌళి సహాయంతో ఈ సిరీస్ లో కొన్ని ఎపిసోడ్స్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు. షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. కానీ నెట్ ఫ్లిక్స్ కి మన వాళ్ళు ఇచ్చే అవుట్ పుట్ నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ని ఆపేసారు.

ఇటీవల రిపబ్లిక్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమా దర్శకుడు దేవాకట్టా మాట్లాడుతూ.. బాహుబ‌లి సిరీస్ ని ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ లాగా చేయాలని ఆలోచన. అయితే అలాంటి ప్రాజెక్టు కేవలం ఇద్దరి దర్శకులతో అయ్యేది కాదు. ప్రాజెక్ట్ కోసం చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్‌’ కథను కూడా పదేళ్లు రాశారు. ఇంకో ఐదేళ్లు స్క్రీన్ ప్లే కోసం పని చేశారు. ఆ తర్వాతే షూటింగ్ కి వెళ్లారు. బాహుబలి వెబ్ సీరీస్ కూడా అదే తరహాలో చేయాలి అంటే దానికి చాలా సమయం పడుతుంది. అందుకనే ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకి వచ్చేసాము అని అన్నారు.

Heroines : ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్స్ వీళ్లే

తర్వాత నెట్ ఫ్లిక్స్ కొత్త టీంతో బాహుబలి సిరీస్ ని ప్లాన్ చేస్తుంది అని సమాచారం. బాహుబలి సినిమా పూర్తి చేయడానికే ఐదేళ్లు పట్టింది. ఇక సిరీస్ అంటే ఇంకెన్నాళ్లు పడుతుందో చూడాలి మరి.