Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్‌ పాడింది ఎవరో తెలుసా..?

‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్‌తో పాటు సాకి పాడిన వ్యక్తి గురించి కూడా నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు..

Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్‌ పాడింది ఎవరో తెలుసా..?

Mogulaiah

Mogalayya: ‘భీం భీం భీం భీం భీమ్లానాయక్’.. గురువారం ఉదయం నుంచి మీడియా, సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 2న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లా నాయక్’ సినిమా ఫస్ట్ సాంగ్‌ రిలీజ్ చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. ‘భీమ్లా నాయక్’ క్యారెక్టరైజేషన్‌ని ఎలివేట్ చేస్తూ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

Bheemla Nayak Title Song : ‘భీం భీం భీం భీం భీమ్లానాయక్.. దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవక్’..

థమన్, శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర, రామ్ మిర్యాల నలుగురూ కలిసి ఈ పాట పాడారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ పాట మొదట్లో సాకి పాడిన వ్యక్తి ఎవరబ్బా.. ఇంతకుముందు ఏవైనా సినిమాల్లో పాడారా అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్‌తో పాటు సాకి పాడిన వ్యక్తి గురించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.

Bheemla Nayak Fans Reaction : థమన్ అన్నా.. ఏం తాగి కొట్టావన్నా మ్యూజిక్..!

అద్భుతమైన గాత్రం.. ఆశ్చర్యపరిచే పద ఉచ్చారణ….
‘‘ఆడా గాదు.. ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రం నీళ్లా గుట్టాకాడ.. అలుగూ వాగు తాండాలోన బెమ్మాజెముడు చెట్టున్నాది.. బెమ్మాజెముడూ చెట్టు కింద అమ్మా నెప్పులు పడతన్నాది.. ఎండా లేదు రేతిరిగాదు.. ఏగూసుక్కా పొడవంగానే పుట్టిండాడు పులీ పిల్ల.. పుట్టిండాడు పులీ పిల్ల.. నల్లమల తాలూకాల.. అమ్మా పేరు మీరాబాయి.. నాయన పేరు సోమ్లా గండు.. తాతా పేరు బహద్దూర్.. ముత్తుల తాత ఈర్యా నాయక్.. పెట్టినపేరు ‘భీమ్లా నాయక్’’.. అంటూ అద్భుతంగా పాడారాయన. మొగులయ్య వాయిస్, పదాలను పలికిన విధానం ఈ జెనరేషన్ వారిని కూడా ఆకట్టుకుంటున్నాయి.

Pawan Kalyan : పవర్‌స్టార్.. క్రేజ్‌కి కేరాఫ్..

అసలు ఇంతకీ ఎవరాయన.. ఏంటా కథ..?
మొగులయ్య.. ప్రముఖ తెలంగాణ జానపద గాయకుడు, 12 మెట్లు కిన్నెర వాద్య కళాకారుడు.. ఉమ్మడి పాలమూరు జిల్లా అచ్చంపేట మండలం లింగాల గ్రామం దర్శనం మొగులయ్య స్వస్థలం. ఆయన తండ్రి ఏడు మెట్ల కిన్నెరను వాయించేవారు. తండ్రి దగ్గరే ఆ కళను నేర్చుకున్న మొగులయ్య.. తన మేధాశక్తితో 7 మెట్ల కిన్నెర స్థానంలో ఆనపకాయ బుర్రలను వెదురుబొంగుకి బిగించి 12 మెట్ల కిన్నెరను తయారు చేశారు.

Mogulaiah

‘పండుగ సాయన్న’ పేరు ఎలా వచ్చిందంటే..
మొగులయ్య తన కళను కేవలం వీరగాథలకు మాత్రమే అంకితమిచ్చారు. పాలమూరు జిల్లాలో ‘పండుగ సాయన్న’, ‘మియాసాబ్’, ‘శంకరమ్మ’, ‘వనపర్తి రాజుల కథలు’ అద్భుతంగా చెప్పేవారు. సమాజాన్ని చైతన్య పరిచేలా మొగలయ్య కథలు చెప్తుంటే వినే వారికి రోమాలు నిక్కబొడుచుకునేవి. ఇటువంటి వీర గాథల ద్వారా ‘పండుగ సాయన్న’ గా పేరు పొందారు.

Mogulaiah

కళే కడుపు నింపింది.. తెలంగాణ ప్రభుత్వం చేయూత నిచ్చింది..
మొగులయ్య వీర గాథలు చెప్పగా విన్న వారు ఇచ్చే కానుకలతోనే ఆయన జీవనం సాగేది. అయితే కొద్ది సంవత్సరాల క్రితం మొగులయ్య కళను ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఒక పీహెచ్‌డీ స్కాలర్ వెలుగులోకి తీసుకొచ్చారు. అప్పటినుంచి తన కళను పలు వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు పొందారు మొగులయ్య. తెలంగాణ ప్రభుత్వం పలు రకాలుగా ఆదుకోవడమే కాక నెలకు రూ. 10 వేలు చొప్పున పెన్షన్ కూడా మంజూరు చేసింది.

Mogulaiah

‘భీమ్లా నాయక్’ టీం అవకాశం..

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ కావడంతో తెలుగు నేటివిటీకి తగ్గట్లు తెలంగాణ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ముందు నుంచి తన సినిమాల్లో జానపద గేయాలను సందర్భానికి అనుగుణంగా వాడే పవన్ కళ్యాణ్‌ను ‘భీమ్లా నాయక్’ గా ఎలివేట్ చేసే పాటలో అలాంటి పదాలు ఉంటే బాగుంటుందనుకుని, మూవీ టీం.. మొగులయ్య గురించి తెలుసుకుని ఆయన పాడిన ఓ పాటని ఆధారంగా చేసుకుని.. ఆ పదాలను వాడుతూ సాకిలో రామజోగయ్య శాస్త్రి మార్పులు చెయ్యగా మొగులయ్య అద్భుతంగా పాడారు. ఈ పాటతో ఆయనకు మరింత గుర్తింపుతో పాటు మరిన్ని అవకాశాలు కూడా వస్తాయి..