Valentine’s Day Special : వ్యాలెంటైన్స్ డే స్పెషల్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!

Valentine’s Day Special : వ్యాలెంటైన్స్ డే వచ్చేసింది. మీ ప్రియమైన వారికి ఆపిల్ Apple iPhoneని గిఫ్ట్‌గా ఇచ్చేందుకు సరైన అవకాశం..

Valentine’s Day Special : వ్యాలెంటైన్స్ డే స్పెషల్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!

Valentine’s Day Special _ iPhone 14 selling at an effective price of Rs 37,900 on iVenus store

Valentines Day Special : వ్యాలెంటైన్స్ డే (Valentine’s Day) వచ్చేసింది. మీ ప్రియమైన వారికి ఆపిల్ Apple iPhoneని గిఫ్ట్‌గా ఇచ్చేందుకు సరైన అవకాశం.. ఐవీనస్ స్టోర్‌లో (iVenus Store) కొత్త iPhone 14ని రూ. 37,900 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 మాత్రమే కాదు.. iVenus ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13, ఎయిర్‌పాడ్స్ ప్రో, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్స్‌లపై కూడా అనేక డీల్స్, డిస్కౌంట్లను అందిస్తోంది.

ఇమాజిన్‌ (Imagine Store)లోని డీల్‌లో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లతో పాటు బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. మీరు స్టోర్ అందించే ప్రత్యేకమైన తగ్గింపును కూడా పొందవచ్చు. iVenus స్టోర్లు గుజరాత్, మహారాష్ట్రలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మీరు ఢిల్లీ NCR నివాసి అయితే.. మీరు iPhone 14, ఇతర మోడళ్లపై డీల్స్ పొందాలంటే.. ఇమాజిన్ స్టోర్‌ని చెక్ చేయవచ్చు. ఐఫోన్ 14లో డీల్ కోసం ఓసారి లుక్కేయండి..

Read Also :  Flipkart Valentine’s Day Sale : ఫ్లిప్‌కార్ట్‌లో వ్యాలెంటైన్స్ డే సేల్.. ఈ 5G స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

ఆపిల్ iPhone 14 మోడల్ అసలు ధర రూ. 79,900 ఉండగా.. వ్యాలెంటైన్స్ డే సందర్భంగా రూ. 37,900 వద్ద కొనుగోలు చేయవచ్చు. iVenus స్టోర్ ఈ డివైజ్‌పై రూ. 8000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అదనంగా, మీరు HDFC కార్డ్‌ని ఉపయోగించి పేమెంట్ చేస్తే.. రూ. 4000 డిస్కౌంట్ లభిస్తుంది. కొనుగోలుదారులు రూ. 22వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. రూ. 8వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ పొందవచ్చు. అన్ని డీల్‌లు కలిపి ఐఫోన్ 14ను రూ. 37,900 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Valentine’s Day Special _ iPhone 14 selling at an effective price of Rs 37,900 on iVenus store

Valentine’s Day Special _ iPhone 14 selling at an effective price

iPhone 14 : స్పెసిఫికేషన్‌లు :
మీరు ఐఫోన్ 14ని రూ. 40వేల లోపు ధరకు పొందడానికి ఇదే బెస్ట్ డీల్., Apple iPhone 14 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED ప్యానెల్‌ను సన్నని బెజెల్స్‌తో, వైడ్ కలర్లను కలిగి ఉంది. డిస్ప్లే HDRకి సపోర్టు ఇస్తుంది. 1200-నిట్స్ బ్రైట్‌నెస్, ఫేస్ ID సెన్సార్‌లతో వస్తుంది.

60Hz ప్రామాణిక రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 14ను A15 బయోనిక్ చిప్, 16-కోర్ NPU, 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రాసెసర్ గరిష్టంగా 4GB RAM, 128GB, 256GB, 512GB వంటి 3 స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. ఐఫోన్ 14 లేటెస్ట్ స్టేబుల్ iOS 16 వెర్షన్‌తో రన్ అవుతుంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 5G, Wi-Fi, డ్యూయల్ సిమ్ (Dual SIM), బ్లూటూత్, GPS, ఛార్జింగ్ కోసం లైట్నింగ్ పోర్ట్‌కు సపోర్టుతో వస్తుంది. కెమెరా విషయానికొస్తే.. iPhone 14 డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. పెద్ద f/1.5 ఎపర్చరు, సెన్సార్-షిఫ్ట్ OIS, సెకండరీ 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్‌తో ప్రైమరీ 12MP వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. వీడియో రికార్డింగ్ కోసం డాల్బీ విజన్‌కు సపోర్టునిస్తుంది.

Read Also : OnePlus 11 5G Sale in India : భారత్‌లో వన్‌ప్లస్ 11 5G సేల్ మొదలైందోచ్.. ఈ బ్యాంకు ఆఫర్లతో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు!