OnePlus 11 5G Sale in India : భారత్‌లో వన్‌ప్లస్ 11 5G సేల్ మొదలైందోచ్.. ఈ బ్యాంకు ఆఫర్లతో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు!

OnePlus 11 5G Sale in India : కొత్త 5G ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 5G ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది.

OnePlus 11 5G Sale in India : భారత్‌లో వన్‌ప్లస్ 11 5G సేల్ మొదలైందోచ్.. ఈ బ్యాంకు ఆఫర్లతో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు!

OnePlus 11 5G sale in India starts today _ Price, bank offers and where to buy

OnePlus 11 5G Sale in India : కొత్త 5G ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 5G ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. భారత మార్కెట్లో ఫిబ్రవరి 14, 2023 మధ్యాహ్నం (ఈరోజు) 12 గంటల నుంచి OnePlus 11 5G ఫోన్ సేల్ ప్రారంభమైంది.

స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ద్వారా ఆధారితమైన ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ అనేక ప్రొడక్టులతో పాటు లాంచ్ అయింది. OnePlus 11 5G ఫోన్ గ్రీన్, బ్లాక్ వంటి రెండు స్టోరేజీ ఆప్షన్లలో వస్తుంది. వినియోగదారులు OnePlus అధికారిక ఆఫ్‌లైన్ ఛానెల్‌లు, Amazon ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

OnePlus 11 5G ధర ఎంతంటే? :
OnePlus 5G బేస్ మోడల్ 8GB RAM, 128GB స్టోరేజీతో వస్తుంది. ఈ వేరియంట్ ధర రూ.56,999గా ఉంది. 16GB RAM, 256GB స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్ ధర రూ.61,999గా ఉంది. గత ఏడాదిలో వన్‌ప్లస్ 10 ప్రో కన్నా వన్‌ప్లస్ 11 5Gని సరసమైన ధరకే అందిస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో బేస్ వేరియంట్ ధర రూ.60,999గా ఉంది.

Read Also : Best Smartphones 2023 : ఈ ఫిబ్రవరిలో రూ.60వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన బ్రాండ్ ఫోన్ కొనేసుకోండి..!

అదనంగా, ప్రారంభ కస్టమర్లను ఆకర్షించడానికి OnePlus కొన్ని బ్యాంక్ ఆఫర్లను ప్రకటించింది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను కలిగిన వినియోగదారులు రూ. 1,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ వరుసగా రూ. 55,999, రూ. 60,999కి అందుబాటులో ఉంటుంది.

OnePlus 11 5G sale in India starts today _ Price, bank offers and where to buy

OnePlus 11 5G sale in India starts today

OnePlus 11 5G స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ కస్టమర్‌లను ఆకర్షించేలా సాలిడ్ హార్డ్‌వేర్‌తో వస్తుంది. 120hz అధిక రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 2K 120Hz సూపర్ ఫ్లూయిడ్ AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంది. హుడ్ కింద.. ఫోన్ Qualcomm లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2ని అందిస్తుంది. SoC గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ రే ట్రేసింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. వన్‌ప్లస్ హాసెల్‌బ్లాడ్‌తో భాగస్వామ్యంతో మూడో సంవత్సరంలోకి ప్రవేశించింది.

వెనుకవైపు ఉన్న ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌లో 50-MP సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్‌తో పాటు 48-MP అల్ట్రా-వైడ్ కెమెరా, టెలిఫోటో లెన్స్‌తో కూడిన 32-MP సోనీ IMX709 సెన్సార్ ఉన్నాయి. OnePlus 11 సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16-MP కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్ కొత్త-జెన్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఆక్సిజన్‌OS 13తో వస్తుంది. వన్‌ప్లస్ 11 నాలుగు ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను అందిస్తామని హామీ ఇచ్చింది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో వచ్చింది. ఛార్జింగ్ స్పీడ్ OnePlus 10Rలో 150W సపోర్టతో వచ్చింది.

OnePlus 11 5G దాదాపు 40 నిమిషాల్లో పూర్తి ఛార్జ్‌ని అందిస్తుంది. మల్టీ టాస్కింగ్‌ని చాలా బాగా నిర్వహిస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ ఫుల్ డే వినియోగాన్ని కలిగి ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే చాలా అద్భుతమైనది. వెనుక కెమెరా మాడ్యూల్ డిజైన్ కూడా యూజర్లను ఆకట్టుకునేలా ఉంది.

Read Also : Flipkart Valentine’s Day Sale : ఫ్లిప్‌కార్ట్‌లో వ్యాలెంటైన్స్ డే సేల్.. ఈ 5G స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!