Vidya Balan : చిరు సోదరిగా విద్యా బాలన్..!

బాలీవుడ్ నటి విద్యా బాలన్‌ను చిరు సిస్టర్ రోల్ కోసం ఫిక్స్ చేశారని తెలుస్తోంది..

Vidya Balan : చిరు సోదరిగా విద్యా బాలన్..!

Vidya Balan

Vidya Balan: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. కొరటాల డైరెక్షన్లో చేస్తున్న ‘ఆచార్య’ షూటింగ్ కొద్ది భాగం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. దాని తర్వాత చిరుతో సినిమా చెయ్యడానికి వెయిట్ చేస్తున్న దర్శకుల లిస్ట్ కొంచెం పెద్దదనే చెప్పాలి.

‘ఆచార్య’ కు గుమ్మడికాయ కొట్టగానే చిరు.. మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ రీమేక్‌ను పట్టాలెక్కించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్‌లో జరుగుతున్నాయి.. మెగాస్టార్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు దర్శకుడు మోహన్ రాజా..

చిరు సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తుందనే వార్తలు వైరల్ కాగా ఇప్పుడు ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ గురించి మరో అప్‌డేట్ ట్రెండ్ అవుతోంది. ‘లూసిఫర్’ లో హీరో సిస్టర్ క్యారెక్టర్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఆ క్యారెక్టర్ వీళ్లు చేస్తున్నారు, వాళ్లు చేస్తున్నారు అంటూ పలు రకాల పుకార్లు షికార్లు చేశాయి. అయితే రీసెంట్‌గా బాలీవుడ్ నటి విద్యా బాలన్‌ను చిరు సిస్టర్ రోల్ కోసం ఫిక్స్ చేశారని తెలుస్తోంది..

లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటుతున్న విద్యా బాలన్ అయితే ఈ క్యారెక్టర్‌ చేస్తే ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌కు మరింత హైప్ తీసుకురావచ్చనేది మేకర్స్ ప్లాన్‌ అనే టాక్ వినబడుతోంది. ఎన్‌ఆర్‌వి సినిమాస్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై సీనియర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.