Karnataka SSLC Results : ఈ నెల 9నే కర్ణాటక SSLC రిజల్ట్స్ విడుదల.. ఇలా చెక్ చేసుకోవచ్చు!

Karnataka SSLC Results : ఎస్ఎస్‌ఎల్‌సీ ఫలితాలు (karresults.nic.in) లేదా (kseab.karnataka.gov.in) అధికారిక వెబ్‌సైట్‌లలో మే 9న ఉదయం 10:30 గంటలకు వెలువడనున్నాయి.

Karnataka SSLC Results : ఈ నెల 9నే కర్ణాటక SSLC రిజల్ట్స్ విడుదల.. ఇలా చెక్ చేసుకోవచ్చు!

Karnataka SSLC Results ( Image Credit : Google )

Karnataka SSLC Results : కర్ణాటక స్కూల్ ఎగ్జామినేషన్స్ అండ్ అసెస్‌మెంట్స్ బోర్డ్ (KSEAB) కర్ణాటక SSLC 2024 ఫలితాలను మే 9న (గురువారం) ప్రకటించనుంది. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు కేఎస్ఈఏబీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఎస్ఎస్‌ఎల్‌సీ ఫలితాలు (karresults.nic.in) లేదా (kseab.karnataka.gov.in) అధికారిక వెబ్‌సైట్‌లలో ఉదయం 10:30 గంటలకు వెలువడనున్నాయి. కర్ణాటక స్కూల్ ఎగ్జామినేషన్ అండ్ వాల్యుయేషన్ బోర్డ్, మల్లేశ్వరం, బెంగళూరులో విలేకరుల సమావేశంలో ఫలితాలు ప్రకటించనుంది.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది అభ్యర్థులు 10వ తరగతి బోర్డు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 4.5 లక్షల మంది పురుషులు, 4.3 లక్షల మంది విద్యార్థినులు ఉన్నారు. ఎస్ఎస్‌ఎల్‌సీ పరీక్ష మార్చి 25 నుంచి ఏప్రిల్ 6 మధ్య జరిగింది. జేటీఎస్ విద్యార్థులకు ప్రాక్టికల్, మౌఖిక పరీక్షలు ఏప్రిల్ 8, 2024న నిర్వహించారు.

ఫలితాల కోసం ఇలా చెక చేయండి :

  • అధికారిక వెబ్‌సైట్ (karresults.nic.in)ని విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలో కర్ణాటక (SSLC) ఫలితాల కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
  • ఈ లింక్‌పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీతో సహా మీ వివరాలను ఎంటర్ చేయండి.
  • మీ వివరాలను ఇచ్చిన తర్వాత Submit బటన్‌పై సమర్పించండి.
  • మీ రిజల్ట్స్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.

Read Also : Air India Express : ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో సంక్షోభం.. 86 సర్వీసులు రద్దు, ప్రయాణికుల అవస్థలు