Virupaksha Collections: విరూపాక్ష ఫస్ట్ డే కలెక్షన్స్.. తేజు గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడుగా!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.12 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించింది.

Virupaksha Collections: విరూపాక్ష ఫస్ట్ డే కలెక్షన్స్.. తేజు గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడుగా!

Virupaksha Day 1 Collections Best For Sai Dharam Tej

Virupaksha: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తరువాత నటించిన ‘విరూపాక్ష’ సాలిడ్ అంచనాల మధ్య నిన్న(ఏప్రిల్ 21) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు పూర్తి మిస్టిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు చెప్పిన దగ్గర్నుండీ ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీని మరింతగా పెంచేశాయి. కాగా, రిలీజ్ రోజునే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో, ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు.

Virupaksha: యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ‘విరూపాక్ష’ విశ్వరూపం.. తొలిరోజు సాలిడ్ వసూళ్లు!

విరూపాక్ష సినిమాలోని థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాయి. ఫలితంగా ఈ సినిమాను చూసిన ఆడియెన్స్ మరిచిపోలేని అనుభూతిని పొందుతున్నారు. ఇక విరూపాక్ష సినిమాకు తొలి రోజే బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు ఏకంగా రూ.12 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చినట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. తేజు కెరీర్’లో ఇది బెస్ట్ ఓపెనింగ్స్ అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. యాక్సిడెంట్ తరువాత తేజు ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు.

Virupaksha: ‘విరూపాక్ష’ను రిలీజ్ చేయండి ప్లీజ్ అంటోన్న నార్త్ ఆడియెన్స్..?

తేజు నమ్మకాన్ని నిజం చేస్తూ విరూపాక్ష బాక్సాఫీస్ వద్ద విశ్వరూపం చూపిస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్న ఆడియెన్స్, ఈ మూవీకి పట్టం కడుతున్నారు. మౌత్ టాక్‌తోనే ఈ సినిమా సక్సెస్ సాధించడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించగా, బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.