RGV: నా చిన్నప్పుడు పెద్దవాళ్లంతా ఇడియట్స్‌ అనుకునేవాడిని.. వర్మ ట్వీట్!

ఇండియాలో ఏది జరిగినా దానిపై స్పందించే వ్యక్తి బహుశా రామ్ గోపాల్ వర్మ ఒక్కరేనేమో. ముఖ్యంగా ఎవరైనా విడాకులు తీసుకుంటున్నారని తెలిస్తే చాలు.. అక్కడ వర్మ దూరి..

RGV: నా చిన్నప్పుడు పెద్దవాళ్లంతా ఇడియట్స్‌ అనుకునేవాడిని.. వర్మ ట్వీట్!

Rgv

RGV: ఇండియాలో ఏది జరిగినా దానిపై స్పందించే వ్యక్తి బహుశా రామ్ గోపాల్ వర్మ ఒక్కరేనేమో. ముఖ్యంగా ఎవరైనా విడాకులు తీసుకుంటున్నారని తెలిస్తే చాలు.. అక్కడ వర్మ దూరి లెట్స్ సెలబ్రేట్ అంటుంటాడు. సినిమా సెలబ్రిటీల విడాకుల నుండి దేశంలో జరిగే రాజకీయాల వరకు.. మరీ ముఖ్యంగా తెలుగు రాజకీయాలను కూడా తనదైన విశ్లేషణ చేస్తూ.. ట్వీట్ల మీద ట్వీట్ల వర్షం కురిపించే వర్మ యధావిధిగా ఇప్పుడు మరో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు.

Telugu Films Release: ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలివే!

ఇంతకు ముంది ఎవరో ఒకరిని పేరు పెట్టకుండానే అటాక్ చేసే వర్మ ఈసారి కాస్త వెరైటీగా పెద్ద వీరందరూ వెధవలె అనేలా ఓ పోస్ట్ పెట్టాడు. పెద్దవాళ్లు మాత్రమే పిల్లలను పిల్లలుగా చూస్తుంటారు. కానీ ఏ పిల్లలు(బాలుడు, బాలికలు) మాత్రం తమని తాము చిన్నిపిల్లలం అని ఎప్పుడూ అనుకోరు. నేను అయితే నా చిన్నతనంలో పెద్దవాళ్లంతా ఇడియట్స్‌ అనుకనేవాడిని. అందుకే ఎప్పటికి నేను పెద్దవాడిని కావోద్దని కోరుకునే వాడిని’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

Ram-Boyapati: క్రేజీ కాంబినేషన్.. మరోసారి డ్యూయెల్ రోల్‌లో ఉస్తాద్ హీరో?

ఆర్జీవీ ప్రస్తుతం చేసిన ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. పెద్దవాళ్లపై వర్మ ఆలోచనలు చూసి నెటిజన్లు తమదైన శైలో స్పందిస్తున్నారు. బాల్యంలోనే ఇలాంటి భావాలు ఉండబట్టే ఇప్పుడు వర్మ ఇలా ఉన్నాడని.. అప్పుడే అన్నీ చూసేశాక.. ఇప్పుడు వోడ్కా తాగక ఇంకేం చేస్తారని.. కొందరు నెటిజన్లు ఫన్నీగా సెటైర్లు వేస్తుంటే.. వర్మ చెప్పేవన్నీ నిజాలే.. ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా గడిపేది ఒక్క బాల్యంలోనే కాబట్టి వర్మ ఎప్పుడూ నిజాలే మాట్లాడతారని కొందరు వెనకేసుకొస్తున్నారు.