Chiranjeevi: టాలీవుడ్ బెస్ట్ డాన్సర్ ఎవరు.. మెగాస్టార్ ఏం చెప్పారంటే..

టాలీవుడ్ సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ డాన్సర్. ఇది ఎప్పుడో ప్రూవ్ అయిన అంశం. బ్రేక్ డాన్స్ నుండి షేక్ డాన్స్ వరకు మెగాస్టార్ అదరగొట్టేశాడు. ఇప్పటికే డాన్స్ లో అదే గ్రేస్ చూపిస్తూ యంగ్ హీరోలకు షాకిస్తున్నాడు.

Chiranjeevi: టాలీవుడ్ బెస్ట్ డాన్సర్ ఎవరు.. మెగాస్టార్ ఏం చెప్పారంటే..

Chiranjeevi

Chiranjeevi: టాలీవుడ్ సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ డాన్సర్. ఇది ఎప్పుడో ప్రూవ్ అయిన అంశం. బ్రేక్ డాన్స్ నుండి షేక్ డాన్స్ వరకు మెగాస్టార్ అదరగొట్టేశాడు. ఇప్పటికే డాన్స్ లో అదే గ్రేస్ చూపిస్తూ యంగ్ హీరోలకు షాకిస్తున్నాడు. మరి యంగ్ హీరోలలో టాలీవుడ్ బెస్ట్ డాన్సర్ ఎవరు?.. చాలాకాలంగా సెలబ్రిటీల నుండి అభిమానుల వరకు ఎక్కువగా వినిపించే ఈ ప్రశ్నకు అంత ఈజీగా ఒకే ఆన్సర్ రావడం లేదు. ఎవరికి వారు తమ హీరోనే బెస్ట్ అంటూ చెప్పుకోడమే తప్ప అందరూ కలిసి ఒక హీరోనే బెస్ట్ అన్న పదాలు వినలేదు.

Chiranjeevi : నా సినిమాని బన్నీ రీమేక్ చేస్తేనే బాగుంటుంది.. బన్నీ గురించి సీక్రెట్ చెప్పిన చిరు

మరి అలాంటిది మెగాస్టార్ చిరంజీవినే యంగ్ హీరోలలో బెస్ట్ డాన్సర్ ఎవరని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు? సీనియర్ హీరోలలో బెస్ట్ డాన్సర్ అయిన చిరంజీవినే యంగ్ హీరోలలో బెస్ట్ డాన్సర్ ఎవరో తేల్చమంటే ఎవరు పేరు చెప్తారు?. ఆచార్య మూవీ రిలీజ్ మరో రెండు రోజులే వుండటంతో చిరంజీ, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివ వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా `ఆచార్య` టీమ్ తో డైరెక్టర్ హరీష్ శంకర్ స్పెషల్ చిట్ ఛాట్ నిర్వహించారు.

Chiranjeevi : మరోసారి చిరు లీక్స్.. ఎవరండీ పవన్ కళ్యాణ్.. ఏంటి వాడి ధైర్యం??

ఈ ఇంటర్వ్యూలో పలు అంశాలపై ప్రశ్నలు సంధించిన హరీష్ శంకర్.. చిరు, చరణ్ లను ఉద్దేశించి మీరిద్దరూ కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్స్ ఎవరని ప్రశ్నించారు. దీనికి చిరు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ఇండస్ట్రీలో చాలా మంది మంచి డాన్సర్ లు వున్నారని.. అందులో ముఖ్యంగా బన్నీ, తారక్, రామ్, నితిన్ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారని వెల్లడించారు. అయితే చిరు చెబుతుండగానే మధ్యలో కల్పించుకున్న రామ్ చరణ్.. నా దృష్టిలో తారక్ బన్నీ బెస్ట్ డాన్సర్స్ అని చెప్పడం విశేషం.