Chiranjeevi : మరోసారి చిరు లీక్స్.. ఎవరండీ పవన్ కళ్యాణ్.. ఏంటి వాడి ధైర్యం??

తాజాగా హరీష్ శంకర్ తో జరిగిన ఇంటర్వ్యూలో చిరు లీక్స్ అంటూ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ సినిమాలోని ఓ పవర్ ఫుల్ డైలాగ్ లీక్ అయ్యేలా చేశారు. పవన్ కళ్యాణ్.........

Chiranjeevi : మరోసారి చిరు లీక్స్.. ఎవరండీ పవన్ కళ్యాణ్.. ఏంటి వాడి ధైర్యం??

Pawan Kalyan

 

Hareesh Shankar :  చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సినిమా రిలీజ్ కి రెండు రోజులే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఆచార్య సినిమాలో వేసిన ధర్మస్థలి సెట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ తో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ చాలా సరదాగా సాగింది. ఇందులో చరణ్, చిరంజీవి, కొరటాల శివ పాల్గొనగా పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు.

 

ఇక చిరు లీక్స్ పేరు ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. సినిమాల గురించి ముందే చెప్పేస్తూ లీక్ చేస్తున్నారు చిరంజీవి. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఈ చిరు లీక్స్ పై స్పందించారు. తాజాగా హరీష్ శంకర్ తో జరిగిన ఇంటర్వ్యూలో చిరు లీక్స్ అంటూ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ సినిమాలోని ఓ పవర్ ఫుల్ డైలాగ్ లీక్ అయ్యేలా చేశారు. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ సినిమా ‘భవదీయుడు భగత్ సింగ్’ లోని ఓ డైలాగ్ ని రివీల్ చేశారు. చిరంజీవి హరీష్ శంకర్ ని పవన్ సినిమాలో మొన్న డైలాగ్ చెప్పావ్ అది చెప్పు అని అడగగా హరీష్.. సర్ వద్దు చిరు లీక్స్, అంటే చిరంజీవి పర్లేదు చెప్పు అన్నారు.

Ameesha Patel : పవన్ కళ్యాణ్ హీరోయిన్‌పై పోలీస్ కేసు.. రివర్స్‌లో పోలీసులకి థ్యాంక్స్ చెప్పిన హీరోయిన్..

 

దీంతో ఈ డైలాగ్ ని హరీష్ శంకర్ వివరించారు. ”సినిమాలో పవన్ కళ్యాణ్ విలన్ దగ్గరికి అలా నడిచి వస్తారు. పవన్ వెనకాల చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. అది చూసిన విలన్.. మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు వీడి ధైర్యం ఏంటని అనుకున్నా. కానీ వీడు అడుగు వేస్తే వెనకాల లక్షమంది వస్తున్నారు. ఇదే వీడి ధైర్యం అని అంటాడు. వెంటనే పక్కన ఉన్న ఇంకో అతను.. వెనకాల లక్ష మంది ఉన్నారని అతని ధైర్యం కాదు. ఆ లక్ష మందికే వీడు ముందు నడుస్తాడనే ధైర్యం అని అంటాడు” ఈ డైలాగ్ చెప్పగానే చరణ్, చిరు, కొరటాల చాలా బాగుంది అని అభినందించారు.

Krishnaji Rao : కేజీఎఫ్ సినిమాలో అంధుడిగా కనిపించిన తాత ఎవరో తెలుసా??

ఇదే డైలాగ్ ని చిరంజీవి ఇప్పుడు పవన్ ఉన్న పరిస్థితులకి అన్వయించి మరోసారి చెప్పారు. చిరంజీవి ఈ డైలాగ్ ని.. ”కొంతమంది అనుకుంటారు ఎవరండీ ఈ పవన్ కళ్యాణ్. వీడి ధైర్యం ఏంటి అని. వీడు నడిస్తే వీడి వెనక లక్షల మంది వస్తారు. వాళ్ళని చూసుకొని అతనికి ధైర్యం అంటే కాదు పవన్ కళ్యాణ్ ని చూసి వాళ్లందరికీ ధైర్యం” అని చెప్పారు. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా ఈ డైలాగ్ ని తెగ షేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ గా ఈ డైలాగ్ సూట్ అవుతుందని, ఈ డైలాగ్ తోనే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పొచ్చని పవన్ అభిమానులు ఆనందిస్తున్నారు.