Krishnaji Rao : కేజీఎఫ్ సినిమాలో అంధుడిగా కనిపించిన తాత ఎవరో తెలుసా??

ఈ సినిమాలో నటించిన చాలా మందికి పేరొచ్చింది. అందులో ఒకరు అంధుడిగా కనిపించే తాత క్యారెక్టర్. ఈ తాత క్యారెక్టర్ 'కేజీఎఫ్ 1'లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈ తాతని..........

Krishnaji Rao : కేజీఎఫ్ సినిమాలో అంధుడిగా కనిపించిన తాత ఎవరో తెలుసా??

Kgf Old Man

Krishnaji Rao :  ప్రస్తుతం దేశమంతటా ‘కేజీఎఫ్ 2’ సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. భారీ అంచనాలతో రిలీజై దేశమంతటా భారీ విజయం సాధించింది ఈ సినిమా. ఇప్పటికే 800 కోట్ల కలెక్షన్స్ రాబట్టి 1000 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్తుంది. ‘కేజీఎఫ్ 2’ భారీ సక్సెస్ సాధించడంతో ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టుల గురించి, ఈ సినిమాకి పని చేసిన వారి గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కొన్ని మీడియా ఛానల్స్ ఆ ప్రయత్నం మీదే సినిమాలో పని చేసిన పలువురి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాయి.

ఈ సినిమాలో నటించిన చాలా మందికి పేరొచ్చింది. అందులో ఒకరు అంధుడిగా కనిపించే తాత క్యారెక్టర్. ఈ తాత క్యారెక్టర్ ‘కేజీఎఫ్ 1’లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈ తాతని కాపాడే సీన్ తోనే సినిమా రేంజ్ పెరుగుతుంది. దీంతో ఈ క్యారెక్టర్ కి మంచి పేరొచ్చింది. ఇక ‘కేజీఎఫ్ 2’లో కూడా ఈ తాత పలు చోట్ల కనిపిస్తాడు. అయితే హీరో గురించి ఎలివేషన్ ఇవ్వడానికి డైరెక్టర్ ఈ తాత క్యారెక్టర్ నే వాడాడు పార్ట్ 2లో. దీంతో మరోసారి ఈ తాత క్యారెక్టర్ హైలెట్ అయింది. ఈ తాత కూడా తన నటనతో, అంధుడిగా, తన హావభావాలతో ప్రేక్షకులని మెప్పించాడు.

Anupama Parameswaran : అనుపమకి కోపం తెప్పించిన ఆకతాయిలు.. ఏం చేశారో తెలుసా??

 

అయితే ప్రేక్షకులు ఈ తాత ఎవరు అని తెగ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇటీవల ఓ కన్నడ ఛానల్ ఈ తాతని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఈ తాత పలు ఆసక్తికర విషయాలని తెలియచేశాడు. ఈ తాత పేరు కృష్ణాజీ రావు. ఆంద్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి చెందినవాడు. యువకుడిగా ఉన్నప్పుడు చాలా పాత సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు. ఆ తర్వాత అవకాశాలు లేక సినిమాలకి టైలరింగ్ చేశాడు. ఆ తర్వాత టచప్ బాయ్ గా, అసిస్టెంట్ గా, క్లాప్ అసిస్టెంట్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. శంకర్ నాగ్ అనే కన్నడ స్టార్ యాక్టర్ వద్ద పర్సనల్ గా కొన్నిరోజులు పనిచేశాడు. ‘కేజీఎఫ్’ ముందు ఓ అసోసియేట్ డైరెక్టర్ తనని చూసి ‘కేజీఎఫ్’ లో ఓ వేషం ఉంది అని ఆడిషన్ కి రమ్మన్నారట.

 

Cannes Film Festival : భారత నటికి అరుదైన గౌరవం.. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీలో దీపికా పదుకొణె..

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’ కోసం తనని ఆడిషన్ తీసుకున్నారట. ఆ పాత్రకి తగ్గ డ్రెస్ వేపించి, మేకప్ వేసి ఆడిషన్ తీసుకొని ప్రశాంత్ నీల్ ఓకే చేసారంట తాత క్యారెక్టర్ కి. డైరెక్టర్ చెప్పినట్టు యాక్టింగ్ చేసేవాడ్ని అని, షూటింగ్ లో అందరూ టైం కరెక్ట్ గా మెయింటైన్ చేసేవారని తెలిపాడు. మొదటి పార్ట్ లో చేసిన పాత్రకి బాగా పేరొచ్చిందని, అదంతా ప్రశాంత్ నీల్ వల్లే అని తెలిపాడు. ఇక రెండో పార్ట్ లో మాత్రం మెయిన్ డైలాగ్ కి చాలా టేక్స్ తీసుకున్నాను అని చెప్పాడు. మొత్తానికి ఇన్ని సంవత్సరాలుగా రాని పేరు ఈ ఏజ్ లో ఒక్క సినిమాతో వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ తాత.