Anupama Parameswaran : అనుపమకి కోపం తెప్పించిన ఆకతాయిలు.. ఏం చేశారో తెలుసా??

ఇటీవల ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌ కోసం అనుపమ పరమేశ్వరన్‌ కోదాడకి వెళ్లారు. అక్కడ ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది. దీంతో అనుపమను చూసేందుకు..........

Anupama Parameswaran : అనుపమకి కోపం తెప్పించిన ఆకతాయిలు.. ఏం చేశారో తెలుసా??

Anupama

Updated On : April 27, 2022 / 3:57 PM IST

 

Anupama Parameswaran :  అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే రౌడీ బాయ్స్ సినిమాతో పలకరించింది. ప్రస్తుతం అనుపమ చేతిలో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు షాప్ ఓపెనింగ్స్ కి వెళ్తుంది. గతంలో చాలా షాప్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి వెళ్ళింది అనుపమ. సెలబ్రిటీలు వచ్చినప్పుడు అక్కడి జనాలు చుట్టముట్టడం, సెల్ఫీల కోసం ఎగబడటం మాముము విషయమే. అయితే ఈ సారి అనుపమకి ఓ చేదు సంఘటన ఎదురైంది.

ఇటీవల ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌ కోసం అనుపమ పరమేశ్వరన్‌ కోదాడకి వెళ్లారు. అక్కడ ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది. దీంతో అనుపమను చూసేందుకు స్థానికులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్ తర్వాత అనుపమ మీడియాతో మాట్లాడింది. అనుపమతో సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు, అక్కడి ప్రజలు ఎగబడ్డారు. ఇక అనుపమ వెళ్లిపోవడానికి సిద్ధమైంది.

Cannes Film Festival : భారత నటికి అరుదైన గౌరవం.. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీలో దీపికా పదుకొణె..

అయితే అనుపమ వెళ్లిపోవడానికి సిద్ధమవుతుండగా కొంతమంది ఇంకాసేపు ఉండాలని అరుస్తూ డిమాండ్ చేశారు. అయితే అప్పటికే అనుపమకు చాలా ఆలస్యం అవ్వడంతో వెళ్లిపోతుండగా కొంతమంది ఆకతాయిలు అనుపమ వెళ్లే కార్ లో గాలి తీసేశారు. దీంతో అనుపమ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీంతో షాపు యజమానులు వెంటనే మరో కారు ఏర్పాటు చేసి అనుపమని పంపించారు. ఈ విషయంలో అనుపమకి బాగా కోపం వచ్చి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.