Cannes Film Festival : భారత నటికి అరుదైన గౌరవం.. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీలో దీపికా పదుకొణె..

వచ్చే నెలలో ప్రారంభం కానున్న 75 వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీలో దీపికా పదుకొణె భాగం అయింది. 75వ ఎడిషన్‌ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కి ఫ్రెంచ్ నటుడు విన్సెంట్ లిండన్ జ్యూరీ............

Cannes Film Festival : భారత నటికి అరుదైన గౌరవం.. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీలో దీపికా పదుకొణె..

Deepika

 

Deepika Padukone :  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె వరుస సినిమాలతో బిజిబిజీ గా ఉంది. ఇటీవలే 83, గెహ్రాయాన్ సినిమాలతో పలకరించిన దీపికా పదుకొణె ప్రస్తుతం మరో నాలుగు సినిమాల్లో నటిస్తుంది. మన ప్రభాస్ తో కూడా ‘ప్రాజెక్టు k’ సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సినిమా ఈవెంట్లలో పాల్గొన్న దీపికకి తాజాగా ఓ అరుదైన గౌరవం లభించింది. గత కొన్ని సంవత్సరాలుగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ లో భాగమవుతున్న దీపికా పదుకొణె ఈ సారి మరింత గౌరవం పొందింది.

RGV : హిందీ సినిమాలకి వైరస్ పట్టింది

వచ్చే నెలలో ప్రారంభం కానున్న 75 వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీలో దీపికా పదుకొణె భాగం అయింది. 75వ ఎడిషన్‌ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కి ఫ్రెంచ్ నటుడు విన్సెంట్ లిండన్ జ్యూరీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇందులో దీపిక భాగమైంది. దీపిక తో పాటు రెబెక్కా హాల్, నూమి రాపేస్, జాస్మిన్ ట్రింకా, అస్గర్ ఫర్హాది, లాడ్జ్ లై, జెఫ్ నికోల్స్, జోచిమ్ ట్రియర్‌లు ఉన్నారు. మే 17 నుండి 10 రోజులపాటు ఈ వేడుక జరగనుండగా 28న కాన్స్‌లో ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుక జరగనుంది. ఈ పది రోజులు దీపికా పదుకొణె ఈ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో జ్యూరీ మెంబర్ గా భాగమవ్వనుంది.