RGV : హిందీ సినిమాలకి వైరస్ పట్టింది

ఆర్జీవీ తన ట్వీట్స్ లో.. ''హిందీలో జెర్సీ ప్లాప్ మరోసారి రీమేక్ లకి కాలం చెల్లిందని నిరూపించింది. కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. నాని ఒరిజినల్ జెర్సీని హిందీలోకి డబ్ చేసి......

RGV : హిందీ సినిమాలకి వైరస్ పట్టింది

Rgv

RGV :  సెన్సేషన్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో, తన ట్వీట్స్ తో, తన మాటలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. దేని గురించి అయినా తనకి ఇష్టమొచ్చింది మాట్లాడేస్తాడు ఆర్జీవీ. ఇటీవల కొన్ని మంచి మంచి ట్వీట్స్ తో కూడా పలకరిస్తున్నారు ఆర్జీవీ. ఇక ఇటీవల సౌత్ సినిమాలు బాలీవుడ్ లో భారీ విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమాలు బాలీవుడ్ లో భారీ హిట్ అవ్వడంతో ఆర్జీవీ బాలీవుడ్ సినిమాలపై వరుసగా ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ సినిమాలపై సెటైరికల్ కామెంట్స్ వేస్తూ తన ట్వీట్స్ తో హడావిడి చేస్తున్నారు.

 

తాజాగా బాలీవుడ్ సినిమాలపై మరోసారి ఆర్జీవీ ట్వీట్స్ చేశాడు. ఇటీవల తెలుగు హిట్‌ సినిమా జెర్సీని హిందీలో రీమేక్‌ చేసి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. షాహిద్‌ కపూర్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన హిందీ జెర్సీ సినిమా రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకున్నా కెజిఎఫ్ 2 సినిమా ముందు జెర్సీ నిలబడలేకపోయింది. కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోతుంది. దీంతో సౌత్ సినిమాల దూకుడు ముందు బాలీవుడ్ సినిమాలు నిలబడలేవంటు ఆర్జీవీ తన ట్వీట్స్ తో వరుస వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

 

ఆర్జీవీ తన ట్వీట్స్ లో.. ”హిందీలో జెర్సీ ప్లాప్ మరోసారి రీమేక్ లకి కాలం చెల్లిందని నిరూపించింది. కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. నాని ఒరిజినల్ జెర్సీని హిందీలోకి డబ్ చేసి విడుదల చేస్తే నిర్మాతలకు కేవలం 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు హిందీలో రీమేక్ చేయడానికి 100 కోట్లు ఖర్చు అయింది. దీంతో టైం, డబ్బు, శ్రమ అన్ని వేస్ట్ అయ్యాయి. పుష్ప, RRR, KGF2 డబ్ చేసి హిట్ అయిన తర్వాత మంచి కంటెంట్ ఉన్న ఏ సౌత్ సినిమా రీమేక్ హక్కులను విక్రయించారు. కంటెంట్ బాగుంటే డబ్ చేసి రిలీజ్ చేస్తే చాలు హిందీ ప్రేక్షకులకు నచ్చుతున్నాయి.”

Telugu Young Heroes: ఒక్క హిట్టుతో సెన్సేషనల్ స్టార్స్.. సినిమాల ఎంపికలో తర్జన భర్జన

”బాలీవుడ్‌కి ఇప్పుడు సూపర్‌హిట్‌లు ఎలా తీయాలో తెలియడం లేదు. సౌత్ సినిమాలని రీమేక్ చేసి ఎక్కువకాలం నిలవలేరని వారికి కూడా తెలుసు. ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి డకౌట్ అయినట్టుంది. దీనిబట్టి ఏమి తెలిసిందంటే మంచి కంటెంట్ సినిమాలు రీమేక్ చేయడం కంటే కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తే బెటర్. ఇప్పుడు తెలుగు, కన్నడ సినిమాలు బాలీవుడ్ కి కరోనా వైరస్ లా పట్టుకున్నాయి. బాలీవుడ్ వాళ్ళు తొందరగా వ్యాక్సిన్ లాంటిది కనుక్కుంటే బెటర్” అంటూ వరుస ట్వీట్స్ చేశాడు ఆర్జీవీ.

Acharya: బాక్సాఫీస్ బరిలో తండ్రి కొడుకులు.. ఎటు చూసినా అంతా పాజిటీవే!

మరి ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలకి బాలీవుడ్ వాళ్ళు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. కానీ ఆర్జీవీ చెప్పిన విషయాలు మాత్రం అక్షర సత్యాలు అని అందరికి తెలిసిందే. బాలీవుడ్ వాళ్ళు సౌత్ సినిమాలు రీమేక్ చేయడం ఎప్పుడు ఆపుతారో చూడాలి. ఇప్పటికే దాదాపు 15 సినిమాల వరకు సౌత్ సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి. ఇక్కడ మంచి విజయం అందుకొని ప్రేక్షకుల మన్ననలు పొందిన సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ చేసి వాటి ఒరిజినల్ సినిమాల్లో ఉండే ఫీలింగ్ ని పోగొడుతున్నారు. దీంతో ఆ సినిమాలు ప్లాప్ అవ్వడమే కాకుండా ప్రేక్షకుల నుంచి ముఖ్యంగా సౌత్ ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాయి.