Telugu Young Heroes: ఒక్క హిట్టుతో సెన్సేషనల్ స్టార్స్.. సినిమాల ఎంపికలో తర్జన భర్జన

ఒక్క సినిమాతో టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్స్ అయిపోయారు. చిన్న సినిమాలతో పెద్ద హిట్ కొట్టిన కొందరు యంగ్ హీరోలు ఒక్కసారిగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించారు. అయితే తర్వాతి సినిమాల విషయంలో మాత్రం తర్జన భర్జన పడుతున్నారు.

Telugu Young Heroes: ఒక్క హిట్టుతో సెన్సేషనల్ స్టార్స్.. సినిమాల ఎంపికలో తర్జన భర్జన

Telugu Young Heroes

Telugu Young Heroes: ఒక్క సినిమాతో టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్స్ అయిపోయారు. చిన్న సినిమాలతో పెద్ద హిట్ కొట్టిన కొందరు యంగ్ హీరోలు ఒక్కసారిగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించారు. అయితే తర్వాతి సినిమాల విషయంలో మాత్రం తర్జన భర్జన పడుతున్నారు. ముందు మెప్పించాం ఇప్పుడెలాంటి సినిమాలతో రావాలనే ఆలోచనలతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎవరా హీరోలు.. ఎంటా కథా…

Young Heroes: సక్సెస్ లేదు కానీ.. వరస సినిమాలను పట్టేస్తున్న లేత హీరోలు!

టాలీవుడ్ సడెన్ స్టార్స్ విపరీతంగా ఆలోచిస్తున్నారు. ఒక్క సినిమాతో టాలీవుడ్ సర్ ప్రైజింగ్ స్టార్స్ గా పేరుతెచ్చుకున్న కొందరు నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై తెగ కసరత్తులు చేస్తున్నారు. సుమారు పన్నేండేళ్ల పోరాటం తర్వాత డీజే టిల్లుతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సిద్దు జొన్నలగడ్డ. అట్లుంటది మనతోనంటూ తెలంగాణ యాసతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్ధూ.. స్టార్ గా ఎదిగే క్రమంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇదివరకు ఒప్పుకున్న మలయాళీ హిట్ కప్పెలా రీమేక్ లో స్పెషల్ రోల్ చేసేందుకు ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించట్లేదని టాక్. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న టైమ్ లో ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి సిద్ధు భయపడుతున్నాడని అంటున్నారు.

Telugu Young Heroes: కంటెంట్ చాలు.. కటౌట్ అవసరం లేదంటున్న చిన్న హీరోలు!

ఫలక్ నామా దాస్ అంటూ మాస్ కా బాప్ మూవీ చూపించిన విశ్వక్ సేన్ పరిస్థితి ఇంతే. హిట్ తో ఓకే అనిపించుకున్నాడు కానీ ఫలక్ నామా దాస్ కి వచ్చిన మ్యానియాను కంటిన్యూ చేయలేకపోయాడు. మొన్నామధ్య వచ్చిన పాగల్ జనాలకు అసలు ఎక్కలేదు. సో స్టైల్ మార్చి మే 6న అశోక వనంలో అర్జున కల్యాణం చూపించబోతున్నాడు. గామి, అక్టోబర్ 31 లేడీస్ నైట్, ఓరీ దేవుడా, దాస్ కీ దమ్కీ, ముఖచిత్రం వంటి ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టి.. వీటితో స్టార్ స్టేటస్ సాధించాలని చూస్తున్నాడు.

Young Heroes: కుర్రాళ్ళ యాక్షన్.. డిజాస్టరవుతున్న సినిమాలు!

టాలీవుడ్ జాతిరత్నం నవీన్ పొలిశెట్టి కూడా నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెంచేశాడు. జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా ఒప్పుకోడానికే చాలా టైమ్ తీసుకున్న నవీన్.. వాటిని తీసుకొచ్చేందుకు మరింత సమయం పట్టేలా ఉంది. అయితే తన జానర్ లోనే తర్వాతి సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. అనుష్కతో చేస్తోన్న మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టితో పాటూ సితారా ఎంటర్ టైన్ మెంట్స్ లో చేస్తోన్న అనగనగా ఒక రాజు మూవీలో కూడా కామెడీనే నవీన్ నమ్ముకున్నాడు.

Young Heroes : ‘తగ్గేదేలే’ అంటున్న టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోస్..

ఆర్ ఎక్స్ 100తో ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చాడు కార్తీకేయ. కానీ తర్వాతి సినిమాల విషయంలో మాత్రం తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది. విలన్ గా చేస్తున్నాడు.. హీరోగా నటిస్తున్నాడు.. తన బాడీని ప్రొజెక్ట్ చేస్తూ ఏదో ట్రై చేస్తునే ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా అడ్వెంచరస్ జానర్ లో అడుగుపెట్టి కొత్త సినిమా షురూ చేశాడు. క్లాక్స్ డైరెక్షన్ లో నేహాశెట్టి హీరోయిన్ గా ప్రారంభమైన సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాయమంటున్నాడు కార్తీకేయ.