Young Heroes : ‘తగ్గేదేలే’ అంటున్న టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోస్..
నిన్న కాక మొన్నొచ్చిన యంగ్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోతున్నారు..
Young Heroes: టాలీవుడ్లో యంగ్ హీరోల హడావిడి పెరిగిపోతోంది. టాలెంట్ ఉంటే తొక్కేసేవాళ్లెవరూ ఉండరు అంటూ.. సత్తా చూపిస్తున్నారు. నిన్న కాక మొన్నొచ్చిన యంగ్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోతున్నారు. హిట్ ఉన్నా లేకపోయినా సక్సెస్ కోసం ట్రై చేస్తూ.. వరుసగా సినిమాల్ని లైన్లో పెడుతున్నారు.
కార్తికేయ..
చిన్న హీరోలు, యంగ్ హీరోలు టాలీవుడ్లో తెగ సందడి చేస్తున్నారు. పెద్దగా హిట్లు లేకపోయినా.. వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలతో తెగ హడావిడి చేస్తున్నారు. లేటెస్ట్గా కార్తికేయ ప్రజెంట్ చేస్తున్న రెండు సినిమాలతో పాటు మరో సినిమా సైన్ చేశాడు. యు.వి కాన్సెప్ట్స్ బ్యానర్లో ప్రశాంత్ డైరెక్షన్లో రుహానీ శర్మ హీరోయిన్గా సినిమా కమిట్ అయ్యాడు కార్తికేయ. ఈ ‘ఆర్ఎక్స్ 100’ హీరో ప్రజెంట్ అజిత్‌తో ‘వాలిమై’ సినిమాతో పాటు ‘రాజా విక్రమార్క’ అనే పవర్ఫుల్ మూవీ చేస్తున్నాడు .
కిరణ్ అబ్బవరం..
నిన్న కాక మొన్నొచ్చిన కిరణ్ అబ్బవరం అయితే.. అబ్బో, అందుకోలేనంత స్పీడ్‌లో ఉన్నాడు. లాక్‌డౌన్‌కి ముందే రిలీజ్ అనౌన్స్ చేసిన ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ ఇంకా రిలీజ్ కానే లేదు.. వరుసగా మూడు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ తో పాటు ‘సెబాస్టియన్’ మూవీలో రేచీకటి ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. వీటితో పాటు కోడి రామకృష్ణ బ్యానర్లో సినిమాతో పాటు ‘సమ్మతమే’ అనే మరో సినిమాని లైనప్ చేశాడు.
సత్యదేవ్..
చిన్న సినిమాలైనా సమ్‌థింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో అందరినీ ఆకట్టుకుంటున్న మరో టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఈ యంగ్ హీరో కూడా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సత్యదేవ్ తమన్నాతో ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాతో పాటు ‘గాడ్సే’ అనే క్రేజీ మూవీ చేస్తున్నాడు. వీటితో పాటు ‘స్కైలాబ్’ అనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలో నటిస్తున్నాడు. వచ్చే నెల ఆగస్ట్ 6న ‘తిమ్మరుసు’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు.
ఆనంద్ దేవరకొండ..
రౌడీ హీరో తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ‘మిడిల్ క్లాస్ మెలొడిస్’ తో అందరినీ ఎంటర్టైన్ చేసిన ఆనంద్ దేవరకొండ ఇప్పుడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. థ్రిల్లర్స్‌తో ఎంటర్టైన్ చేసే కెవి. గుహన్ డైరెక్షన్లో ‘హైవే’ మూవీతో పాటు దామోదర డైరెక్షన్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రెడీ అవుతున్న ‘పుష్పక విమానం’ కూడా చేస్తున్నాడు ఆనంద్ దేవరకొండ.