Young Heroes: కుర్రాళ్ళ యాక్షన్.. డిజాస్టరవుతున్న సినిమాలు!

సినిమాల్లోకి వచ్చాక ఒక జానర్ కి ఫిక్స్ అయిపోయారనే ఇమేజ్ తెచ్చుకోకుండా ఉండడానికి అన్నిరకాల క్యారెక్టర్లు చేస్తుంటారు. లవ్, రొమాన్స్, ఎమోషన్, యాక్షన్ లాంటి అన్ని రకాల జానర్స్ ట్రై..

Young Heroes: కుర్రాళ్ళ యాక్షన్.. డిజాస్టరవుతున్న సినిమాలు!

Young Heroes

Young Heroes: సినిమాల్లోకి వచ్చాక ఒక జానర్ కి ఫిక్స్ అయిపోయారనే ఇమేజ్ తెచ్చుకోకుండా ఉండడానికి అన్నిరకాల క్యారెక్టర్లు చేస్తుంటారు. లవ్, రొమాన్స్, ఎమోషన్, యాక్షన్ లాంటి అన్ని రకాల జానర్స్ ట్రై చేస్తున్నారు. కానీ కొంతమంది హీరోలు యాక్షన్ చేస్తే మాత్రం చూడలేపోతున్నారు జనాలు. ఈ హీరోలు యాక్షన్ సినిమాలు వస్తుంటే చాలు ప్రేక్షకులు మాకొద్దు బాబోయ్ అంటూ దూరం జరిగిపోతున్నారు. మరి యాక్షన్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యలేకపోతున్న హీరోలెవరో చూద్దాం.

Telugu Young Heroes: కంటెంట్ చాలు.. కటౌట్ అవసరం లేదంటున్న చిన్న హీరోలు!

మిగతా హీరోలు ఏం చేసినా చూస్తున్నారు కానీ.. ఈ హీరోలు యాక్షన్ చేస్తే మాత్రం చూడలేమంటున్నారు ఆడియన్స్. రొమాన్స్, లవ్ బోర్ కొట్టేసిందని యాక్షన్ లోకి దిగినఈ హీరోలు సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాని.. ఇప్పటి వరకూ బాయ్ నెక్ట్స్ డోర్ సినిమాలు చేసి ఆడియన్స్ కి దగ్గరైన నాని.. వి, టక్ జగదీష్ సినిమాల్లో యాక్షన్ చేసి చూపించారు. మిగతా ఎమోషన్స్ ఉన్నా కూడా యాక్షన్ కంటెంటే ఎక్కువ చేశారు నాని. కానీ ఈ రెండు సినిమాల రిజల్ట్ నానీకి మైలేజ్ ఇవ్వలేకపోయాయి.

Young Heroes: పడుతూ లేస్తున్న యంగ్ హీరోలు.. ఒక్క బ్లాక్ బస్టర్ ప్లీజ్!

శర్వానంద్ కూడా కెరీర్ లో రకరకాల జానర్స్ ట్రై చేశారు. వీటన్నింటిలో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు మాత్రం పెద్దగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. శర్వా రణరంగం, మహాసముద్రం లాంటి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీస్ డిజాస్టర్ అయ్యాయి. కానీ పడిపడి లేచెమనసు, మహానుభావుడు, శతమానంభవతి లాంటి ఫ్యామిలీ, రొమాంటిక్ సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి.

Telugu Senior Heroes: కుర్ర భామలతో రొమాన్స్.. ఏజ్ బార్ హీరోల కష్టాలు

ఆమధ్య వరసగా లవ్ రొమాంటిక్ సినిమాలు చేసిన నితిన్.. రూట్ మార్చి యాక్షన్ చేసి చేతులు కాల్చుకున్నాడు. లాస్ట్ ఇయర్ చెస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన యాక్షన్ మూవీ చెక్, అంతకుముందు వచ్చిన లై లాంటి యాక్షన్ మూవీస్ అన్నీ డిజాస్టర్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ, లవ్ ఎంటర్ టైనర్స్ రంగ్ దే, మ్యాస్ట్రో మంచి రిజల్టే ఇచ్చాయి. సో.. ఆడియన్స్ కి నితిన్ యాక్షన్ చేస్తే నచ్చట్లేదన్నమాట.

Heroes Love Songs: యాక్షన్, డ్రామా, థ్రిల్లర్, జానర్ ఏదైనా.. ప్రేమ ఉండాల్సిందే!

కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ చేసిన అక్కినేని హీరో అఖిల్ కి కూడా పెద్దగా యాక్షన్ కలిసిరాలేదు. అఖిల్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ యాక్షన్ తో ఆకట్టుకోలేకపోయాడు. దాంతో రూట్ మార్చి హలో, మిస్టర్ మజ్ను లాంటి డిఫరెంట్ మూవీస్ చేసినా వర్కవుట్ కాలేదు. కానీ రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం అదిరిపోయే హిట్ కొట్టింది.

Telugu Star Heroes: పాన్ ఇండియా రేంజ్.. బాలీవుడ్‌లో టాలీవుడ్ హీరోల క్రేజ్

మరో యంగ్ హీరో నాగశౌర్య యాక్షన్ సినిమాలు చేస్తే అంతగా ఆదరించడం లేదు ఆడియన్స్. అశ్వద్దామ, లక్ష్య లాంటి సినిమాలు అనుకున్నంత హిట్ కొట్టలేకపోయాయి. అయితే ఓ బేబీ, వరుడు కావలెను లాంటి క్యూట్ లవ్ స్టోరీలు ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్నాయి. ఇలా ఈ హీరోలు యాక్షన్ చేస్తే మాత్రం జనాలకు నచ్చడం లేదు.. అందుకే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్లుగా మిగిలిపోతున్నాయి.