Chiranjeevi : నా సినిమాని బన్నీ రీమేక్ చేస్తేనే బాగుంటుంది.. బన్నీ గురించి సీక్రెట్ చెప్పిన చిరు
ఇంటర్వ్యూలో చిరంజీవి, చరణ్, కొరటాల శివ పాల్గొనగా హరీష్ శంకర్ అడిగిన పలు ప్రశ్నలకి ఆసక్తికర విషయాలని తెలియచేశారు. ఇందులో భాగంగా హరీష్ శంకర్ మీ కామెడీ సినిమాల్లో చంటబ్బాయి సినిమాని ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు తీస్తే బాగుంటుంది, ఆ రోల్ లో.............

Chiru
Chiranjeevi : చరణ్, చిరంజీవి కలిసి నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే జరగగా సినిమా రిలీజ్ కి రెండు రోజులే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఆచార్య సినిమాలో వేసిన ధర్మస్థలి సెట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ తో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి, చరణ్, కొరటాల శివ పాల్గొనగా హరీష్ శంకర్ అడిగిన పలు ప్రశ్నలకి ఆసక్తికర విషయాలని తెలియచేశారు.
Acharya : ఇండియాలోనే ఫస్ట్ బిగ్గెస్ట్ సెట్.. ధర్మస్థలిపై మెగాస్టార్ మాటల్లో..
ఇందులో భాగంగా హరీష్ శంకర్ మీ కామెడీ సినిమాల్లో చంటబ్బాయి సినిమాని ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు తీస్తే బాగుంటుంది, ఆ రోల్ లో ఎవరిని చూడాలి అనుకుంటున్నారు అని అడగగా దీనికి సమాధానంగా చిరంజీవి.. ”నాకు తెలిసి చంటబ్బాయి సినిమా ఈ జనరేషన్ లో బన్నీ చేయగలడు. బన్నీ బేసిక్ గా మిమిక్ కూడా. అన్ని కామెడీ వాయిస్ లు బాగా చేస్తాడు. మిమిక్రీతో నవ్విస్తాడు కూడా, బన్నీ చంటబ్బాయి సినిమా చేయగలడు” అని తెలిపారు. దీంతో బన్నీ మిమిక్రి కూడా చేసి నవ్విస్తాడనే సీక్రెట్ చిరు బయట పెట్టేశారు. బన్నీ అభిమానులు ఇది తెలుసుకొని ఆనందిస్తున్నారు.