Bihar : ప్రియుడు కోసం ప్రతీరోజు గ్రామాన్ని అంధకారం చేస్తున్న యువతి ..

ప్రియుడి కోసం ఓ యువతి ఏకంగా గ్రామాన్ని అంథకారం చేసింది. అసలు విషయం తెలిసి గ్రామస్తులంతా ఏం చేశారంటే..

Bihar : ప్రియుడు కోసం ప్రతీరోజు గ్రామాన్ని అంధకారం చేస్తున్న యువతి ..

Woman cuts off power supply for lover

Woman cuts off power supply for lover : అదో గ్రామం. రాత్రి సమయంలో ప్రతీరోజు కరెంట్ కట్ అవుతోంది. మొదట్లో ఎందుకో అనుకునేవారు గ్రామస్తులు అంతా. కానీ ప్రతీరోజు కరెంట్ పోతోంది. దీంతో విసుగొచ్చేసింది ఊర్లో అందరికి రోజు ఇలాగే అవుతోంది ఏంటా అని ఆరా తీశారు. ప్రతీరోజు గ్రామంలో కరెంట్ పోవటానికి కారణం ఓ యువతి అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు గ్రామస్తులంతా. ఓ యువతి ప్రతీ రోజు రాత్రి అయితే చాలు ట్రాన్స్ ఫారం వద్దకు వెళ్లి కరెంట్ ఆఫ్ చేస్తోంది. మరి ఆమె ఎందుకలా చేస్తోంది తెలిసి రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్న గ్రామస్తులు ఆమెకు తగినశాస్తి చేశారు? ఇంతకీ ఆమె ఎందుకు కరెంట్ ఆఫ్ చేస్తోంది..? గ్రామాన్ని ఎందుకు చీకటి చేస్తోందంటే..

Seema Haider : సీమా హైదర్‌ను పాక్ సరిహద్దుల్లో విసిరేస్తాం : కర్ణిసేన హెచ్చరిక

’ప్రియుడు కోసం’ అని తెలిసింది. బీహార్ లోని నైథాన్ పోలీస్ స్టేషన్ పరిథిలోని బేటియా గ్రామంలో ప్రతీరోజు రాత్రి సమయంలో ఏకాంతంగా ప్రియుడ్ని కలుసుకోవటానికి రోజు కరెంట్ ఆఫ్ చేస్తోంది. ప్రతీరోజు కరెంట్ పోవటంతో విసిగిపోయిన గ్రామస్తులంతా ఎందుకిలా జరుగుతోందో తెలుసుకోవాలనుకున్నారు. కొంతమంది మగవారు అంతా కలిసి ఆ గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ ఫారం వద్దకెళ్లారు. అక్కడ ఓ యువతి యువకుడు కూర్చుని ఏకాంతంలో మునిగిపోయి ఉన్నారు. అది చూసి గ్రామస్తులు షాక్ అయ్యారు.

వారిద్దరిని నిలదీశారు. దీంతో అసలు విషయం చెప్పారు. అదే గ్రామానికి చెందిన సదరు యువతిని ఓ యువకుడు ప్రేమిస్తున్నాడు.ఆమెను కలుసుకోవటానికి రోజు రాత్రి సమయంలో ఆ గ్రామం వస్తున్నాడు. దీంతో అతడిని కలుసుకునేందుకు ఆమె కరెంట్ కట్ చేస్తోంది.అదే విషయం చెప్పేసరికి తెల్లబోయిన గ్రామస్తులు సదరు యువకుడిని కొట్టారు. దీంతో ఆమె అడ్డం వెళ్లి వారిని వారించింది. తాను అతనిని ప్రేమిస్తున్నానని చెప్పింది. దీంతో ఈ విషయాన్ని వారి పెద్దలవద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వారిద్దరికి పెళ్లి చేయటానికి పెద్దలను ఒప్పించారు. అలా వారిద్దరికి ‘పెళ్లి’కుదర్చారు. ఇక ఆగ్రామంలో ప్రతీరోజు కరెంట్ కట్ అవ్వటంలేదు.

Seema Haider : సీమా హైదర్ సోదరుడు, మామ పాక్ ఆర్మీలో…షాకింగ్ నిజం