Allu Arjun: బన్నీతో రొమాన్స్‌కు రెడీ అవుతోన్న బాలీవుడ్ బ్యూటీ.. ఎవరంటే?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లు బన్నీ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో బన్నీ మరోసారి పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఓ బాలీవుడ్ బ్యూటీ బన్నీతో రొమాన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Allu Arjun: బన్నీతో రొమాన్స్‌కు రెడీ అవుతోన్న బాలీవుడ్ బ్యూటీ.. ఎవరంటే?

Allu Arjun To Romance Kiara Advani In His Next Movie

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లు బన్నీ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో బన్నీ మరోసారి పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

Allu Arjun : పుష్ప 2 మొదలైంది.. తగ్గేదేలే.. కంటెంట్ ఉంటే జనాలు థియేటర్స్ కి వస్తారు..

అయితే ఓ బాలీవుడ్ బ్యూటీ బన్నీతో రొమాన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు.. కియారా అద్వానీ. గతంలో మహేష్ బాబు, రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటించిన ఈ బాలీవుడ్ బ్యూటీ, ప్రస్తుతం మరోసారి చరణ్ సరసన డైరెక్టర్ శంకర్ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ బ్యూటీని తారక్ 30వ చిత్రంలో నటించాలని కోరగా, ఆమె డేట్ల విషయంలో సర్దుబాటు కాకపోవడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే బన్నీ చేయబోయే నెక్ట్స్ మూవీలో హీరోయిన్‌గా నటించేందుకు కియారా రెడీ అంటూ క్లూ ఇచ్చిందట.

Allu Arjun: బన్నీ హాలీవుడ్ ఎంట్రీ.. కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్!

కాగా, బన్నీ తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో చేస్తున్నాడనే విషయంపై క్లారిటీ లేదు. కానీ, ఎవరితో సినిమా అయినా కూడా.. ఈ సినిమాలో ఖచ్చితంగా కియారా నటిస్తుందనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మరి నిజంగానే కియారా అద్వానీ బన్నీ నెక్ట్స్ మూవీలో నటించబోతుందా అనేది చూడాల్సి ఉంది.