Allu Arjun: బన్నీ హాలీవుడ్ ఎంట్రీ.. కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ ‘పుష్ప - ది రైజ్’కు సీక్వెల్‌గా ‘పుష్ప - ది రూల్’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. న్యూయార్క్ నగరంలో జరిగిన ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో బన్నీ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే బన్నీకి ఓ భారీ హాలీవుడ్ ఆఫర్ లభించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Allu Arjun: బన్నీ హాలీవుడ్ ఎంట్రీ.. కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్!

Allu Arjun Gets Hollywood Offer News Goes Viral

Updated On : August 26, 2022 / 6:38 PM IST

Alllu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ ‘పుష్ప – ది రైజ్’కు సీక్వెల్‌గా ‘పుష్ప – ది రూల్’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రెడీ చేయనుంది. ఇక ఈ సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండనుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Allu Arjun : న్యూయార్క్ మేయర్‌తో తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్.. అమెరికాలో బన్నీ సందడి..

ఇక ఇటీవల 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బన్నీకి అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్ నగరంలో జరిగిన ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో బన్నీ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ నిర్వహించిన భారీ పెరేడ్‌కు బన్నీ మార్షల్‌గా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే బన్నీకి ఓ భారీ హాలీవుడ్ ఆఫర్ లభించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. న్యూయార్క్‌లో ఉన్న బన్నీని హాలీవుడ్‌కు చెందిన ఓ పాపులర్ డైరెక్టర్ మీట్ అయ్యాడట.

Allu Arjun in America : అమెరికాలో భారత స్వతంత్ర వేడుకలకు గెస్టుగా అల్లు అర్జున్..

ఆయన బన్నీకి ఓ సూపర్ హీరో కథను వినిపించాడని.. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఉండబోతుందని చిత్ర వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ వార్తలపై బన్నీ అండ్ టీమ్ ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంతకీ బన్నీని మీట్ అయిన హాలీవుడ్ డైరెక్టర్ ఎవరు.. ఆయన బన్నీకి నిజంగానే కథను వివరించాడా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఏదేమైనా బన్నీ నిజంగానే హాలీవుడ్ మూవీకి ఓకే చెబితే మాత్రం ఇది సెన్సేషనల్ న్యూస్ అనే చెప్పాలి.