Balakrishna: బాలీవుడ్ భరతం పట్టేందుకు రెడీ అవుతున్న బాలయ్య..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరో యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

Balakrishna: బాలీవుడ్ భరతం పట్టేందుకు రెడీ అవుతున్న బాలయ్య..?

Balakrishna Eyeing On Bollywood With Anil Ravipudi

Balakrishna: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే, బాలయ్య తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే లాక్ చేశాడు. మరో యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

Balakrishna: NBK107 క్రేజీ అప్డేట్.. అధికారికంగా ప్రకటించిన చిత్ర నిర్మాతలు!

ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్యను నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపిస్తున్నాడని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమాను బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడట. దీంతో ఈ సినిమాను కేవలం తెలుగునాటే కాకుండా ఇతర భాషల్లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ముఖ్యంగా ఈ సినిమాతో బాలీవుడ్ మార్కెట్‌లో బాలయ్య తన ప్రతాపం చూపేందుకు రెడీ అవుతున్నాడట. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమాలకు బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

NBK108 Movie: బాలయ్య నెక్ట్స్ మూవీ అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది!

అంతేగాక, మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా అనిల్ రావిపూడికి మంచి పేరుంది. దీంతో బాలయ్యతో చేయబోయే సినిమాను హిందీతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలని చూస్తున్నాడట. ఇక ఈ సినిమాలో బాలయ్య పాత్ర కూడా సరికొత్తగా ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సినిమాను బాలీవుడ్‌లో రిలీజ్ చేస్తే, అక్కడ ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.