Chiranjeevi: ‘గాడ్‌ఫాదర్’లో చిరు ఎంతసేపు కనిపిస్తాడో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించగా, చిరు ఈ సినిమాలో సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. కాగా, ఈ సినిమాలో చిరు ఎంతసేపు కనిపిస్తాడా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది.

Chiranjeevi: ‘గాడ్‌ఫాదర్’లో చిరు ఎంతసేపు కనిపిస్తాడో తెలుసా..?

Chiranjeevi Role Length In Godfather Movie

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించగా, చిరు ఈ సినిమాలో సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. ఇక మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్ చిత్రానికి గాడ్‌ఫాదర్ తెలుగు రీమేక్‌గా వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Godfather: ‘గాడ్ ఫాదర్’ ప్రీరిలీజ్ బిజినెస్.. టార్గెట్ ఎంతో తెలుసా?

ముఖ్యంగా మలయాళం లూసిఫర్ చిత్రాన్ని చూసినవారిలో గాడ్‌ఫాదర్ సినిమాలో చిరు ఎంతసేపు కనిపిస్తాడా అనే సందేహం నెలకొంది. ఎందుకంటే.. మలయాళం లూసిఫర్ మూవీలో మోహన్ లాల్ పాత్ర నిడివి కేవలం 50 నిమిషాలు మాత్రమే ఉంది. దీంతో గాడ్‌ఫాదర్‌లో చిరు స్క్రీన్ ప్రెజెన్స్ కూడా తక్కువగా ఉంటుందా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు మోహన్ లాల్ ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో చిరు పాత్ర నిడివి ఒరిజినల్ సినిమాతో పోల్చితే చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు.

Godfather: ‘గాడ్‌ఫాదర్’లో మెగా సర్‌ప్రైజ్.. పండగ చేసుకోనున్న ఫ్యాన్స్!

గాడ్‌ఫాదర్ సినిమాలో చిరు పాత్ర నిడివి ఏకంగా రెండు గంటల పాటు ఉంటుందని.. అంతేగాక, ఒరిజినల్ సినిమాతో పోల్చితే, ఈ సినిమాలో పది పాత్రలు మనకు ఎక్కువగా కనిపిస్తాయని ఆయన తెలిపారు. ఒరిజినల్ కథకు చాలా మార్పులు చేసినట్లుగా ఆయన తెలిపారు. దీంతో చిరు పాత్ర నిడివిపై నెలకొన్న అనుమానాలకు ఫుల్‌స్టాప్ పడింది. ఇక తమ అభిమాన హీరోను రెండు గంటలపాటు తెరపై చూసి అభిమానులు ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ తెలిపింది. అటు సల్మాన్ ఖాన్ కేమియో పాత్ర కూడా ప్రేక్షకులను కట్టిపడేయనుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.