Godfather: ‘గాడ్‌ఫాదర్’లో మెగా సర్‌ప్రైజ్.. పండగ చేసుకోనున్న ఫ్యాన్స్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ దసరా రోజున ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులకూ ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Godfather: ‘గాడ్‌ఫాదర్’లో మెగా సర్‌ప్రైజ్.. పండగ చేసుకోనున్న ఫ్యాన్స్!

Godfather: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ దసరా రోజున ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో చిరు తిరిగి బౌన్స్‌బ్యాక్ అవ్వడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కించడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

Godfather: గాడ్‌ఫాదర్ కోసం సల్మాన్ ఖాన్ ఎంత పుచ్చుకున్నాడో తెలుసా..?

కాగా, ఈ సినిమాలో చిరు ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులకూ ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇటీవల గాడ్‌ఫాదర్ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిరు, సల్మాన్ ఖాన్‌లు ఈ సర్‌ప్రైజ్ ఏమిటో రివీల్ చేశారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Godfather: గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఈ ఇద్దరిపైనే అందరి చూపులు!

ఈ సినిమాలో చరణ్ కేమియో నిజమేనా అని చిరును అడగ్గా.. అవును నిజమే అని ఆయన సమాధానం ఇచ్చారు. ఇక సల్మాన్ ఖాన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. గాడ్‌ఫాదర్ సెట్స్‌లో చరణ్ తనను కలవడానికి వచ్చాడని.. తనతో కలిసి నటించాలని ఉందని చరణ్ చెప్పాడని.. అయితే దీని గురించి తరువాత మాట్లాడుదాం అని తాను చెప్పగా.. నెక్ట్స్ డే చరణ్ తన కాస్ట్యూమ్స్‌తో ప్రత్యక్షమయ్యాడని సల్మాన్ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు గాడ్‌ఫాదర్ చిత్ర యూనిట్ రివీల్ చేయని ఈ సర్‌ప్రైజ్‌ను ఇద్దరు హీరోలు కూడా రివీల్ చేయడంతో ఈ సినిమాలో చరణ్ ఎప్పుడు కనిపిస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాలో అందాల భామ నయనతార, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.