Godfather: గాడ్‌ఫాదర్ కోసం సల్మాన్ ఖాన్ ఎంత పుచ్చుకున్నాడో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ మరికొద్ది రోజుల్లో రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించినందుకు సల్మాన్ ఖాన్ ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకున్నాడనే ఆసక్తి అందరిలో నెలకొనగా, ఈ సినిమా కోసం సల్మాన్ చిల్లిగవ్వ కూడా తీసుకోలేదని చిరు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Godfather: గాడ్‌ఫాదర్ కోసం సల్మాన్ ఖాన్ ఎంత పుచ్చుకున్నాడో తెలుసా..?

Salman Khan Remuneration For Chiranjeevi Godfather

Godfather: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ మరికొద్ది రోజుల్లో రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాతో మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద తిరిగి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన లూసిఫర్ చిత్రానికి తెలుగు రీమేక్‌గా గాడ్‌ఫాదర్ వస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

Godfather: గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఈ ఇద్దరిపైనే అందరి చూపులు!

కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్ర ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనుందని చిత్ర యూనిట్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది. ఇక ఈ సినిమాలో చిరు, సల్మాన్‌లు కలిసి చేసిన సీన్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్తను చిరంజీవి తాజాగా వెల్లడించారు.

Godfather: గాడ్‌ఫాదర్ నుండి మరో అప్డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న ‘నజభజ’ సాంగ్!

ఈ సినిమాలో నటించినందుకు సల్మాన్ ఖాన్ ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకున్నాడనే ఆసక్తి అందరిలో నెలకొనగా, ఈ సినిమా కోసం సల్మాన్ చిల్లిగవ్వ కూడా తీసుకోలేదని చిరు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సల్మాన్‌తో తనకు చాలా ఏళ్లుగా మంచి స్నేహం ఉందని.. అందుకే ఈ సినిమాలో నటించేందుకు సల్మాన్ ప్రేమతో ముందుకు వచ్చాడని.. అలాంటి సల్మాన్ మంచితనానికి నిజంగా సెల్యూట్ అని చిరు చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సల్మాన్ గాడ్‌ఫాదర్ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవడ నిజంగా విశేషమని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాలో చిరు, సల్మాన్‌లను కలిసి చూసేందుకు వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.