Godfather: ‘గాడ్ ఫాదర్’ ప్రీరిలీజ్ బిజినెస్.. టార్గెట్ ఎంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ రేపు దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు రెడీ అయ్యింది. గాడ్ ఫాదర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ కావడంతో, ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Godfather: ‘గాడ్ ఫాదర్’ ప్రీరిలీజ్ బిజినెస్.. టార్గెట్ ఎంతో తెలుసా?

Godfather Pre-Release Business Details

Godfather: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ రేపు దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా హై వోల్టేజ్ పొలిటిక్ డ్రామాగా తెరకెక్కించగా, ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక మెగా ఫ్యాన్స్ ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమాతో చిరంజీవి తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Godfather: ‘గాడ్‌ఫాదర్’లో మెగా సర్‌ప్రైజ్.. పండగ చేసుకోనున్న ఫ్యాన్స్!

ఇక ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. గాడ్ ఫాదర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఏర్పడటంతో ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. గాడ్ ఫాదర్ మూవీని తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కళ్లు చెదిరేలా జరిగిందని చిత్ర యూనిట్ తెలిపింది.

Godfather: గాడ్‌ఫాదర్ కోసం సల్మాన్ ఖాన్ ఎంత పుచ్చుకున్నాడో తెలుసా..?

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ గాడ్ ఫాదర్ క్రేజ్ కారణంగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. ఇక ఓవర్సీస్‌లోనూ భారీ రేటుకు ఈ చిత్ర హక్కులను అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా గాడ్ ఫాదర్ చిత్రం రూ.90 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది చిరంజీవి గత చిత్రాలతో పోలిస్తే తక్కువే అని చిత్ర వర్గాలు అంటున్నాయి. కాగా, ఏరియాల వారీగా ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 22 కోట్లు
సీడెడ్ – 13.50 కోట్లు
ఆంధ్ర – 35 కోట్లు
ఏపీ+తెలంగాణ – 70.50 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు సమాచారం.
కర్ణాటక – 6.50 కోట్లు
హిందీ – 6.50 కోట్లు
ఓవర్సీస్ – 7.50 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లుగా చిత్ర వర్గాలు వెల్లడించాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.