Mahesh Babu: అమ్మ చేతి కాఫీ.. దేవుడి ప్రసాదంతో సమానమన్న మహేశ్ బాబు

మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు గతంలో తన తల్లి గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Mahesh Babu: అమ్మ చేతి కాఫీ.. దేవుడి ప్రసాదంతో సమానమన్న మహేశ్ బాబు

Mahesh Babu: మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి బుధవారం ఉదయం కన్నుమూశారు. ఇందిరా దేవి గురించి బయటివాళ్లకు తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే ఆమె సినిమా ఫంక్షన్లు, బయటి కార్యక్రమాలకు ఎక్కువగా వచ్చేవారు కాదు.

India vs South Africa 1st T20: తిరువనంతపురంలో వర్షాలు కురిసే ఛాన్స్.. నేటి టీ20 మ్యాచ్ జరిగేనా?

ఒక సూపర్ స్టార్‌కు సతీమణి, మరో సూపర్ స్టార్‌కు తల్లి అయినా సరే చాలా సాధారణ జీవితం గడిపారు. ఇక, మహేశ్ బాబుకు తన తల్లి ఇందిరా దేవి అంటే అమితమైన ఇష్టం. చాలా సందర్భాల్లో ఆ ప్రేమను బయటకు చాటుకున్నారు. పలు ఇంటర్వ్యూలు, సినిమా వేడుకల్లో తల్లి గురించి మాట్లాడారు. తల్లితో తనకున్న అనుబంధాన్ని వెల్లడించేవారు. ఏదైనా కుటుంబ కార్యక్రమాలకు తల్లితో కలిసి హాజరైతే ఆమె చెయ్యి పట్టుకుని, పక్కనే ఉండేవారు. మహేశ్ బాబు తన తల్లితో ఉన్న అరుదైన ఫొటోలు, వీడియోల్ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసేవారు.

Saudi Arabia: సౌదీ అరేబియా ప్రధానిగా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్.. ఆదేశాలు జారీ చేసిన రాజు

ఇందిరా దేవి మరణించిన నేపథ్యంలో గతంలో మహేశ్ బాబు తన తల్లి గురించి చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో తన తల్లి అంటే ఎంతో ఇష్టమని, ప్రతి సినిమా విడుదల సందర్భంగా ఆమె దగ్గరికి వెళ్లి కాఫీ తాగొస్తుంటానని చెప్పారు. ఆ కాఫీ తాగితే దేవుడి గుళ్లో ప్రసాదం తీసుకున్నట్లుగా అనిపిస్తుందని మహేశ్ అన్నారు.