Saudi Arabia: సౌదీ అరేబియా ప్రధానిగా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్.. ఆదేశాలు జారీ చేసిన రాజు

సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను ప్రధానిగా నియమిస్తూ ఆ దేశ రాజు సల్మాన్ అబ్దులాజిజ్ అల్ సౌద్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు వివాదాస్పద యువరాజుగా పేరుంది.

Saudi Arabia: సౌదీ అరేబియా ప్రధానిగా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్.. ఆదేశాలు జారీ చేసిన రాజు

Updated On : September 28, 2022 / 9:05 AM IST

Saudi Arabia: సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌ ఆ దేశ ప్రధానిగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయనను ప్రధానిగా నియమిస్తూ సౌదీ అరేబియా రాజు సల్మాన్ అబ్దులాజిజ్ అల్ సౌద్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

Indira Devi: మహేశ్ బాబుకు మాతృవియోగం.. అనారోగ్యంతో కన్నుమూసిన ఇందిరాదేవి

ఎంబీఎస్‌గా పిలిచే మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ చరిత్రలో అత్యంత వివాదాస్పద యువరాజుల్లో ఒకడిగా ఉన్నాడు. 2018లో ఇస్తాంబుల్‌లోని సౌదీ వాణిజ్య రాయబార కార్యాలయంలో జరిగిన సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్య కేసులో ఎంబీఎస్ ప్రమేయం ఉన్నట్లు ఇటీవల అమెరికా ఆరోపించింది. ఈ హత్యకు ఆయనే ఆదేశించినట్లు అమెరికా చెప్పింది. కానీ, ఈ ఆరోపణలను సౌదీ యువరాజు ఎంబీఎస్ కొట్టిపారేశారు. అయితే, అతడికి సౌదీ అరేబియాలో ప్రజల నుంచి మద్దతు ఉంది. చాలా మంది అతడిని సమర్ధుడైన యువరాజుగా అభివర్ణిస్తారు.

DRDO: తక్కువ శ్రేణి రక్షణ మిస్సైల్ పరీక్ష విజయవంతం.. వాయుతల ముప్పును ఎదుర్కొనే మిస్సైల్స్

చమురు సరఫరాలో సౌదీ అరేబియాను ముందంజలో నిలపడంలో, సామాజిక, ఆర్థిక, మతపరమైన సంస్కరణలు తీసుకురావడంలో ఎంబీఎస్ కీలకంగా వ్యవహరించాడని అక్కడి వాళ్ల అభిప్రాయం. సౌదీ అరేబియాకు విదేశీ పెట్టుబడులు ఆకర్షించడలోనూ సఫలమయ్యాడు. 2017లో ఆయన సౌదీ యువరాజుగా ఎంపికయ్యారు. సౌదీని అన్ని దేశాలకు మిత్ర దేశంగా మారుస్తానని ఎంబీఎస్ గతంలో అన్నారు.