India vs South Africa 1st T20: తిరువనంతపురంలో వర్షాలు కురిసే ఛాన్స్.. నేటి టీ20 మ్యాచ్ జరిగేనా?

'హలో తిరువనంతపురం' అంటూ బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. భారత క్రికెటర్లు తిరువనంతపురం చేసుకున్న దృశ్యాలను అందులో చూపింది. అయితే, ఇవాళ తిరువనంతపురంలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ మ్యాచ్ అనుకున్న ప్రకారం జరుగుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరుణుడు కరుణిస్తేనే మ్యాచ్ జరగొచ్చు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ జరిగే తొలి టీ20లో దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనున్న విషయం తెలిసిందే.

India vs South Africa 1st T20: తిరువనంతపురంలో వర్షాలు కురిసే ఛాన్స్.. నేటి టీ20 మ్యాచ్ జరిగేనా?

India vs South Africa 1st T20: ‘హలో తిరువనంతపురం’ అంటూ బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. భారత క్రికెటర్లు తిరువనంతపురం చేసుకున్న దృశ్యాలను అందులో చూపింది. అయితే, ఇవాళ తిరువనంతపురంలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ మ్యాచ్ అనుకున్న ప్రకారం జరుగుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరుణుడు కరుణిస్తేనే మ్యాచ్ జరగొచ్చు.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ జరిగే తొలి టీ20లో దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. భారత బౌలర్లు హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌ ఈ సిరీస్ లో ఆడడం లేదు. వచ్చే నెల నుంచి టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో వారిద్దరికి విశ్రాంతి ఇచ్చారు. కరోనా వల్ల షమీ కూడా ఈ సిరీస్ లో ఆడడం లేదు. మిగతా భారత క్రికెట్ జట్టు సభ్యులు అందరూ తిరువనంత పురం చేరుకున్నారు. అభిమానులకు హాయ్ చెబుతూ వారు ఎయిర్ పోర్టు నుంచి హోటల్ కు వెళ్లారు.

భారత్ ఇటీవల ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలిచిన ఉత్సాహంతో ఉంది. దక్షిణాఫ్రికా జట్టు కూడా బలంగా ఉంది. ఈ రెండు జట్ల మధ్య పోటీ బాగా ఉండనుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో ఇప్పటివరకు రెండు టీ20 మ్యాచ్ లు మాత్రమే జరిగాయి. ఈ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. గత రెండు టీ20ల్లో రెండు ఇన్నింగ్సుల్లోనూ 170కి పైగా స్కోర్లు నమోదయ్యాయి.

Rain alert for Telangana: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం