Pushpa 2: పుష్ప-2 కోసం మూడు.. దేవిశ్రీ ప్రసాద్ సెన్సేషన్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప-2 రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా పుష్ప 2 సినిమా మ్యూజిక్ గురించి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఓ అదిరిపోయే వార్త చెప్పుకొచ్చాడు.

Pushpa 2: పుష్ప-2 కోసం మూడు.. దేవిశ్రీ ప్రసాద్ సెన్సేషన్!

Devi Sri Prasad About The Musical Update Of Pushpa 2

Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప-2 రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రీసెంట్‌గా ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ కూడా చేశారు.

Pushpa 2: పుష్ప-2.. మరింత గ్రాండియర్‌గా రాబోతున్న పుష్పరాజ్!

అయితే ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా ప్రేక్షకులు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. తాజాగా పుష్ప 2 సినిమా మ్యూజిక్ గురించి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఓ అదిరిపోయే వార్త చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దేవిశ్రీ, పుష్ప 2 సినిమా కోసం తాను ఆల్రెడీ మూడు పాటలు కంపోజ్ చేశానని.. అవి చాలా అద్భుతంగా వచ్చాయని ఆయన అన్నారు. ఇక ఈ సినిమా మొదటి భాగంగా కంటే కూడా మ్యూజికల్‌గా రెట్టింపు విజయాన్ని అందుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Pushpa 2 The Rule: ‘పుష్ప-2 ది రూల్’ మూవీ పూజా కార్యక్రమం ఫోటోలు

అటు సుకుమార్ ఈ సినిమా కోసం రాసుకున్న కథ అమోఘంగా ఉందని.. ప్రతిఒక్కరికీ ఈ సినిమా చాలా బాగా నచ్చుతుందని ఆయన అన్నారు. ఇక పుష్ప-2 చిత్రంలో బన్నీ మరోసారి ఊరమాస్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.