Pushpa 2: పుష్ప-2.. మరింత గ్రాండియర్‌గా రాబోతున్న పుష్పరాజ్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన దగ్గర్నుండీ, పుష్ప2 కోసం ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను పుష్ప తొలిభాగం కంటే కూడా మరింత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

Pushpa 2: పుష్ప-2.. మరింత గ్రాండియర్‌గా రాబోతున్న పుష్పరాజ్!

Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సరికొత్త ట్రెండ్ సెట్టింగ్ పర్ఫార్మెన్స్‌తో బన్నీ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన దగ్గర్నుండీ, పుష్ప2 కోసం ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారు.

Pushpa 2 The Rule: ‘పుష్ప-2 ది రూల్’ మూవీ పూజా కార్యక్రమం ఫోటోలు

అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తుండగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలను చిత్ర యూనిట్ పూర్తి చేసింది. ఇవాళ ఉదయం పుష్ప 2 చిత్రాన్ని అఫీషియల్‌గా లాంఛ్ చేశారు. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసేందుకు సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను పుష్ప తొలిభాగం కంటే కూడా మరింత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

Pushpa 2 Movie Opening : అల్లు అర్జున్ లేకుండానే మొదలుపెట్టేసిన సుక్కూ.. పుష్ప 2 పూజా కార్యక్రమం..

ఈ సినిమాలో గ్రాండియర్, భారీతనం పుష్ప ఫస్ట్ పార్ట్ కంటే డబుల్ రేంజ్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా ఇంత ఆలస్యంగా స్టార్ట్ అవ్వడానికి ఇదే కారణమని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని.. ఎక్కడా ఎలాంటి పొరబాట్లు జరగకుండా ఆయన పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగబోతున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.