Dhamaka: ధమాకా టార్గెట్ ఎంతో తెలుసా.. మాస్ రాజా చరిష్మాతో సాధ్యమే!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ రేపు ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో మాస్ రాజా రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ముందునుండీ చెబుతూ వస్తోంది.

Dhamaka: ధమాకా టార్గెట్ ఎంతో తెలుసా.. మాస్ రాజా చరిష్మాతో సాధ్యమే!

Dhamaka Movie Pre-Release Business Details

Dhamaka: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ రేపు ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో మాస్ రాజా రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ముందునుండీ చెబుతూ వస్తోంది.

Dhamaka : మరోసారి రవితేజ డ్యూయల్ రోల్.. ఈ సారన్నా వర్కౌట్ అవుతుందా??

ఈ సినిమా ప్రమోషన్స్‌తో ‘ధమాకా’ సినిమాపై అదిరిపోయే బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాపై చిత్ర యూనిట్ పూర్తి కాన్పిడెంట్‌గా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరగడంతో ఈ సినిమాపై చిత్ర వర్గాల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

Dhamaka: ధమాకాలో ముద్దులు అందుకే లేవంటోన్న రవితేజ..?

ధమాకా చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.18.30 కోట్ల మేర ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిపినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.16 కోట్ల మేర థియేట్రికల్ ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఏరియాల వారీగా ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 5.5 కోట్లు
సీడెడ్ – 2.5 కోట్లు
ఆంధ్ర – 8 కోట్లు
ఏపీ+తెలంగాణ – 16 కోట్లు
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్ – 2.30 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్ – రూ.18.30 కోట్లు