Godfather: గాడ్‌ఫాదర్ ఫస్ట్ టైటిల్ కాదా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్‌గా నిలిచింది. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ తాజాగా ప్రెస్ మీట్‌లో ఈ సినిమా విజయానికి సంబంధించి మీడియా వారితో ముచ్చటించారు.

Godfather: గాడ్‌ఫాదర్ ఫస్ట్ టైటిల్ కాదా..?

Godfather Was Not The First Title For Chiranjeevi Movie

Godfather: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్‌గా నిలిచింది. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపారు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా రావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Godfather: మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ 6 రోజుల కలెక్షన్స్.. మండే టెస్ట్ ఏమైందంటే?

ఇక ఈ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ మూవీగా ఈ సినిమా నిలిచింది. కాగా, ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ తాజాగా ప్రెస్ మీట్‌లో ఈ సినిమా విజయానికి సంబంధించి మీడియా వారితో ముచ్చటించారు. ఈ క్రమంలో గాడ్‌ఫాదర్ సినిమా టైటిల్ గురించి చిత్ర యూనిట్ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమాకు తొలుత గాడ్‌ఫాదర్ టైటిల్‌ను అనుకోలేదని.. ఈ సినిమాకు తొలుత ‘సర్వాంతర్యామి’ అనే టైటిల్ పెట్టాలని తాము భావించామని.. ఇదే టైటిల్‌తో ఓ సాంగ్ కూడా కంపోజ్ చేశామని తెలిపారు.

Godfather: సల్లూ భాయ్ కోసం మెగాస్టార్ కాస్ట్‌లీ సర్‌ప్రైజ్.. ఏమిటో తెలుసా?

అయితే థమన్ ఈ సినిమాకు గాడ్‌ఫాదర్ టైటిల్‌ను సజెస్ట్ చేశాడని.. చిరు కెరీర్‌లో గ్యాంగ్‌లీడర్, ఘరానా మొగుడు సినిమాలు G అనే అక్షరంతో వచ్చి సూపర్ సక్సెస్ అయ్యాయని.. ఈ క్రమంలోనే గాడ్‌ఫాదర్ కూడా బాగుంటుందని థమన్ చెప్పుకొచ్చినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. మొత్తానికి థమన్ ఊహించినట్లుగానే గాడ్‌ఫాదర్ మూవీకి ప్రేక్షకులు పట్టం కట్టడంతో చిరు అండ్ టీమ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.