Godfather: సల్లూ భాయ్ కోసం మెగాస్టార్ కాస్ట్‌లీ సర్‌ప్రైజ్.. ఏమిటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించగా, పూర్తి పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటన ఈ సినిమాకు మరింత కలిసి వచ్చింది.

Godfather: సల్లూ భాయ్ కోసం మెగాస్టార్ కాస్ట్‌లీ సర్‌ప్రైజ్.. ఏమిటో తెలుసా?

Chiranjeevi Planning Surprise Gift For Salman Khan For Godfather Success

Godfather: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించగా, పూర్తి పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్, సరికొత్త గెటప్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

Godfather: మెగాస్టార్ సినిమాపై సూపర్‌స్టార్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

అయితే ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటన ఈ సినిమాకు మరింత కలిసి వచ్చింది. చిరు, సల్మాన్ ఖాన్‌ల స్క్రీన్ అపియెరెన్స్ ఈ సినిమాకు మరింత బూస్ట్ ఇచ్చిందని చిత్ర వర్గాలు అంటున్నాయి. కాగా ఈ సినిమాలో నటించినందుకు సల్మాన్ ఖాన్ ఒక్కరూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని చిరు పలు సందర్భాల్లో తెలిపారు. అయితే గాడ్‌ఫాదర్ చిత్రానికి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా సక్సెస్‌ను చిత్ర యూనిట్ ఎంజాయ్ చేస్తోంది. అయితే గాడ్‌ఫాదర్ విజయంలో సల్మాన్ ఖాన్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉండటంతో, చిరు తాజాగా సల్మాన్‌కు ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

GodFather Collections : నాలుగు రోజుల్లో.. 100 కోట్ల గాడ్‌ఫాదర్.. మరింత దూసుకుపోతున్న బాస్ సినిమా..

సల్మాన్ ఖాన్ కోసం ఓ ఖరీదైన కారును చరణ్‌తో కలిసి చిరు బహుమతిగా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. త్వరలోనే ఈ సర్‌ప్రైజ్‌ను సల్మాన్‌కు అందించేందుకు రెడీ అవుతున్నారట మెగాస్టార్. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.