GodFather Collections : నాలుగు రోజుల్లో.. 100 కోట్ల గాడ్‌ఫాదర్.. మరింత దూసుకుపోతున్న బాస్ సినిమా..

గాడ్‌ఫాదర్ సినిమా మొదటి రోజు పండగపూట ప్రపంచ వ్యాప్తంగా 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా 31 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇంకా..........

GodFather Collections : నాలుగు రోజుల్లో.. 100 కోట్ల గాడ్‌ఫాదర్.. మరింత దూసుకుపోతున్న బాస్ సినిమా..

God Father collects 100 crores gross collections

Updated On : October 10, 2022 / 1:34 PM IST

GodFather Collections :  చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ ని తెలుగులో గాడ్‌ఫాదర్ రిలీజ్ చేశారు. దసరా రోజూ రిలీజ్ చేసిన గాడ్‌ఫాదర్ భారీ విజయం సాధించింది. చిరంజీవిని చాలా రోజుల తర్వాత ఫుల్ మాస్ ఎలివేషన్స్ తో చూపించారు. పండగపూట అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టారు మెగాస్టార్. సినిమా సూపర్ హిట్ అయి కలెక్షన్స్ కూడా అదరగొడుతున్నాయి.

గాడ్‌ఫాదర్ సినిమా మొదటి రోజు పండగపూట ప్రపంచ వ్యాప్తంగా 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా 31 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇంకా దసరా సెలవులు ఉండటం, వీకెండ్ కావడంతో గాడ్‌ఫాదర్ సినిమా నాలుగురోజుల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Manchu Lakshmi : ఎవరి బతుకు వాళ్ళని బతకనివ్వండి.. మనోజ్ రెండో పెళ్లిపై మంచు లక్ష్మి వ్యాఖ్యలు..

బాలీవుడ్ లో కూడా సినిమా హిట్ టాక్ రావడంతో మరిన్ని స్క్రీన్స్ జత చేశారు. దీంతో గాడ్‌ఫాదర్ కలెక్షన్స్ మరింతగా దూసుకుపోతున్నాయి. దీంతో మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు చిత్ర యూనిట్.