Godfather: మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ 6 రోజుల కలెక్షన్స్.. మండే టెస్ట్ ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించగా, మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాలో చిరు పాత్ర అల్టిమేట్‌గా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

Godfather: మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ 6 రోజుల కలెక్షన్స్.. మండే టెస్ట్ ఏమైందంటే?

Chiranjeevi Godfather Movie Collections

Godfather: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించగా, మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాలో చిరు పాత్ర అల్టిమేట్‌గా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

Godfather: సల్లూ భాయ్ కోసం మెగాస్టార్ కాస్ట్‌లీ సర్‌ప్రైజ్.. ఏమిటో తెలుసా?

గాడ్‌ఫాదర్ చిత్రానికి తొలిరోజే పాజిటివ్ రివ్యూలు రావడంతో, ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఆ తరువాత రోజుల్లో పుంజుకుంది. ఇక దసరా సెలవులు కూడా ఉండటంతో ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ దక్కింది. అయితే మండే టెస్టులో ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదని చెప్పాలి. అయినా కూడా కలెక్షన్ల పరంగా ఈ సినిమా దూసుకుపోతుందని, త్వరలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. గాడ్‌ఫాదర్ మూవీ రిలీజ్ అయిన 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.51.77 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Godfather: మెగాస్టార్ సినిమాపై సూపర్‌స్టార్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

ఇక ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. గాడ్‌ఫాదర్ చిత్రం 6 రోజుల థియేట్రికల్ రన్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 11.37 కోట్లు
సీడెడ్ – 8.71 కోట్లు
ఉత్తరాంధ్ర – 5.16 కోట్లు
ఈస్ట్ – 3.35 కోట్లు
వెస్ట్ – 1.98 కోట్లు
గుంటూరు – 3.66 కోట్లు
నెల్లూరు – 1.84 కోట్లు
కృష్ణా – 2.40 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.38.47 కోట్లు
కర్ణాటక – 4.40 కోట్లు
హిందీ బెల్ట్ – 4.40 కోట్లు
ఓవర్సీస్ – 4.50 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.51.77 కోట్లు