The Ghost Trailer Runtime Locked: నాగార్జున్ ‘ది ఘొస్ట్’ ట్రైలర్ రన్ టైమ్ లాక్!

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రన్‌టైమ్‌ను కూడా చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ది ఘోస్ట్ మూవీ ట్రైలర్ రన్‌టైమ్‌ను 1 నిమిషం 55 సెకన్లుగా ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్.

The Ghost Trailer Runtime Locked: నాగార్జున్ ‘ది ఘొస్ట్’ ట్రైలర్ రన్ టైమ్ లాక్!

Nagarjuna The Ghost Runtime

The Ghost Trailer Runtime Locked: అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్, ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

The Ghost Movie: ‘ది ఘోస్ట్’ మూవీ షూటింగ్ ముగించేసిన నాగార్జున

అయితే ఈ సినిమా ట్రైలర్‌ను ఇవాళ సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ ట్రైలర్‌ను లైగర్ మూవీకి సంబంధించిన థియేటర్లలో ఆల్రెడీ అటాచ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో నాగ్ పాత్ర సరికొత్తగా ఉండబోతుందన చిత్ర యూనిట్ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ రన్‌టైమ్‌ను కూడా చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది.

The Ghost: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ది ఘోస్ట్’

ది ఘోస్ట్ మూవీ ట్రైలర్ రన్‌టైమ్‌ను 1 నిమిషం 55 సెకన్లుగా ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ది ఘోస్ట్ చిత్రాన్ని దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఎంగేజింగ్ కంటెంట్‌తో తీసుకొస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక నాగ్ ఈ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కాగా, ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఇవాళ సాయంత్రం రిలీజ్ చేస్తుండటంతో అందరూ ఈ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.