Taraka Ratna Passes Away : తారకరత్న కన్నుమూత.. సోమవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు

సినీ నటుడు నందమూరి తారకరత్న (40) కన్నుమూశారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

Taraka Ratna Passes Away : తారకరత్న కన్నుమూత.. సోమవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు

Taraka Ratna Passes Away : సినీ నటుడు నందమూరి తారకరత్న (40) కన్నుమూశారు.  గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. జనవరి 27న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభంలో అస్వస్థతకు గురయ్యారు తారకరత్న. జనవరి 28న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. 22 రోజులుగా ఆ ఆస్పత్రిలో చికిత్స అందించారు.

విదేశాల నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చి బెంగళూరులో తారకరత్నకు చికిత్స చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కోమాలోకి వెళ్లిన తారకరత్నను కాపాడేందుకు డాక్టర్లు చేసిన విశ్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. తారకరత్న మృతితో అటు సినీ పరిశ్రమలో, ఇటు నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Also Read..Nandamuri Taraka Ratna Passes Away : నందమూరి తారకరత్న కన్నుమూత

తారకరత్న పార్ధివదేహాన్ని ఆదివారం ఉదయానికి మోకిలలోని ఆయన నివాసానికి తరలిస్తారు. ఎల్లుండి (సోమవారం) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Also Read..Taraka Ratna Demise : తారకరత్న మృతికి సీఎం జగన్, చంద్రబాబు సంతాపం.. లోకేశ్ భావోద్వేగం