Nandamuri Taraka Ratna Passes Away : నందమూరి తారకరత్న కన్నుమూత

నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న తారకరత్న కాసేపటి క్రితం మృతి చెందారు.

Nandamuri Taraka Ratna Passes Away : నందమూరి తారకరత్న కన్నుమూత

Nandamuri Taraka Ratna : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న తారకరత్న శనివారం రాత్రి మృతి చెందారు.

చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభం సమయంలో తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు వచ్చింది. స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు.

అనంతరం మెరుగైన వైద్యం కోసం జనవరి 28న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ప్రత్యేక వైద్య బృందం తారకరత్నకు చికిత్స అందిస్తోంది. తీవ్ర గుండెపోటు సహా ఇతర అనారోగ్య సమస్యల వల్ల తారకరత్న కోలుకోలేకపోయారు. చివరికి తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి మృతి చెందారు.

Also Read..Taraka Ratna Passes Away : తారకరత్న కన్నుమూత.. సోమవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు

విదేశాల నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చి బెంగళూరులో తారకరత్నకు చికిత్స చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కోమాలోకి వెళ్లిన తారకరత్నను కాపాడేందుకు డాక్టర్లు చేసిన విశ్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. తారకరత్న మృతితో అటు సినీ పరిశ్రమలో, ఇటు నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

నందమూరి తారకరత్న (40) బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జనవరి 27న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభంలో అస్వస్థతకు గురయ్యారు తారకరత్న. ఆయనకు గుండెపోటు వచ్చింది. జనవరి 28న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. 22 రోజులుగా ఆ ఆస్పత్రిలో చికిత్స అందించారు. నందమూరి మోహన కృష్ణ కుమారుడు తారకరత్న. తారకరత్నకు ఒక పాప. అలేఖ్యా రెడ్డిని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు తారకరత్న. నందీశ్వరుడు చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు అలేఖ్యా రెడ్డి.

Taraka Ratna Number 9 : 27న గుండెపోటు, 18న కన్నుమూత.. నందమూరి తారకరత్నకు కలిసిరాని 9 అంకె

20 ఏళ్ల వయస్సులో కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు తారకరత్న. 2001లో ఒకటో నంబర్ కుర్రాడు చిత్రంతో తెలుగు తెరకు నటుడిగా పరిచయం అయ్యారు. ఒక వెబ్ సిరీస్, 22 చిత్రాల్లో నటించారు. 2006 తర్వాత మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. 2009లో అమరావతి చిత్రంతో మళ్లీ సినీ జీవితాన్ని మొదలుపెట్టారు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు తారకరత్న. అమరావతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు అందుకున్నారు. రాజా చెయ్యి వేస్తే చిత్రంలోనూ ప్రతినాయకుడిగా నటించారు. తారకరత్న సారథి చిత్రం విడుదల కావాల్సి ఉంది.

తారకరత్న నటించిన చిత్రాలు:
ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి, ముక్కంటి, నందీశ్వరుడు, విజేత, ఎదురులేని అలెగ్జాండర్, చూడాలని చెప్పాలని, మహాభక్త సిరియాల, కాకతీయుడు, ఎవరు, మనమంత, రాజా చెయ్యి వేస్తే, ఖయ్యూంబాయ్, దేవినేని, ఎస్ 5 నో ఎగ్జిట్, సారథి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించారు తారకరత్న. 9 చిత్రాల్లో 5 చిత్రాలు మాత్రమే విడుదల అయ్యాయి. ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

అభిమానుల సందర్శన కోసం తారకరత్న పార్ధివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచనున్నారు. మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.