NBK107: ‘వీరసింహారెడ్డి’గా సంక్రాంతి బరిలో దిగుతున్న బాలయ్య!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ 107వ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ ఎట్టకేలకు అనౌన్స్ చేసింది. NBK107 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘వీరసింహారెడ్డి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ చిత్ర యూనిట్ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

NBK107: ‘వీరసింహారెడ్డి’గా సంక్రాంతి బరిలో దిగుతున్న బాలయ్య!

NBK107 Official Title Veera Simha Reddy

NBK107: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ 107వ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ ఎట్టకేలకు అనౌన్స్ చేసింది. NBK107 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

Mega154 NBK107: బాలయ్య-చిరు సినిమా టైటిల్స్‌లో కామన్ పాయింట్.. నిజమేనా?

ఇక తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు ‘వీరసింహారెడ్డి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ చిత్ర యూనిట్ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో బాలయ్య గతంలో కనిపించిన లుక్‌లోనే కనిపించాడు. పులిచర్ల 4.కిమీ మైలురాయిపై కాలుపెట్టి బాలయ్య నిలబడిన స్టయిల్ సూపర్‌గా ఉందంటూ అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఇక వీరసింహారెడ్డి పాత్రలో బాలయ్య పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది.

NBK107: బాలయ్య సినిమాకు ఈ టైటిల్ ఫిక్స్ చేశారా.. నెట్టింట ఒకటే మోత!

కాగా, ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఇక బాలయ్య ‘వీరసింహారెడ్డి’గా బాక్సాఫీస్ భరతం పట్టడం ఖాయమని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.