Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. ‘ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) న‌టిస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). హరీష్ శంకర్ (Harish Shankar) ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. ‘ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’

Ustaad Bhagat Singh Update

Ustaad Bhagat Singh Update : ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) న‌టిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). హరీష్ శంకర్ (Harish Shankar) ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ గ్లింప్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ్యాన‌రిజాన్ని ఎలివేట్ చేసేలా సాగుతూ విజువ‌ల్ ట్రీట్ అందించింది. తాజాగా నేడు (సెప్టెంబ‌ర్ 2)న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర‌బృందం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.

RS Shivaji : విషాదం.. సీనియ‌ర్ న‌టుడు, క‌మెడియ‌న్ క‌న్నుమూత‌

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ ఓ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లుంగీ క‌ట్టుకుని క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని ఓ చెక్క‌లాంటి దానిపై కూర్చోని చేతిలో క‌త్తి ప‌ట్టుకుని క‌నిపిస్తున్నాడు. క‌త్తికి ర‌క్తం మ‌ర‌క‌లు కూడా ఉన్నాయి. ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది.

Jailer OTT Release Date : జైల‌ర్ ఓటీటీ డేట్ ఫిక్స్‌.. ప్లాట్‌ఫామ్ మారింది.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే..?

‘గ‌బ్బ‌ర్ సింగ్’ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత ప‌వ‌న్‌, హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా న‌టిస్తోంది. తమిళ్ న‌టుడు విజయ్ నటించిన ‘తేరి’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆ మూవీ మెయిన్ ప్లాట్ మాత్రం తీసుకోని కథ మొత్తం చేంజ్ చేసి ఉస్తాద్ భగత్ సింగ్ ని రూపొందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.