Jailer OTT Release Date : జైలర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. ప్లాట్‌ఫామ్ మారింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన సినిమా జైలర్. చాలా కాలం తరువాత ఈ సినిమాతో రజినీకాంత్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

Jailer OTT Release Date
Jailer OTT Release Date Fix : సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన సినిమా ‘జైలర్’. చాలా కాలం తరువాత ఈ సినిమాతో రజినీకాంత్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమన్నా (Tamannaah), కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్, కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
Salaar : ప్రభాస్ అభిమానులకు మళ్ళీ నిరాశే.. సలార్ సినిమా వాయిదా కన్ఫర్మ్..
ఇప్పటి వరకు రూ.600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వారికి శుభవార్త అందింది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 7 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. తెలుగుతో పాటు అన్ని దక్షిణాది బాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
Samantha : అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న సమంత..
సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు 200కోట్ల బడ్జెట్‌తో జైలర్ సినిమాను నిర్మించడంతో అందరూ ఈ సినిమా సన్ నెక్ట్స్‌లో ప్రసారం అవుతుందని ఊహించారు. అయితే.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో పలు రికార్డులు బద్దలు కొట్టిన జైలర్ సినిమా ఓటీటీలో మరెన్నీ సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సిందే.
Jailer’s in town, it’s time to activate vigilant mode! ??#JailerOnPrime, Sept 7 pic.twitter.com/2zwoYR6MqV
— prime video IN (@PrimeVideoIN) September 2, 2023