RS Shivaji : విషాదం.. సీనియ‌ర్ న‌టుడు, క‌మెడియ‌న్ క‌న్నుమూత‌

సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, క‌మెడియ‌న్ ఆర్ఎస్ శివాజీ (RS Shivaji) క‌న్నుమూశారు.

RS Shivaji : విషాదం.. సీనియ‌ర్ న‌టుడు, క‌మెడియ‌న్ క‌న్నుమూత‌

RS Shivaji

RS Shivaji passed away : సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, క‌మెడియ‌న్ ఆర్ఎస్ శివాజీ (RS Shivaji) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న చెన్నైలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ప‌రిస్థితి విష‌మించ‌డంతో శ‌నివారం తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 66 సంవ‌త్స‌రాలు. ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

Rajinikanth : జైలర్ సినిమాకు రజినీకాంత్ రెమ్యునరేషన్.. వామ్మో అంతా.. ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్?

1956లో చెన్నైలో ఆర్ఎస్ శివాజీ జ‌న్మించారు. 1981లో ప‌న్నీర్ పుష్పాలు చిత్రంలో తెర‌గ్రేటం చేశారు. నాలుగు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో న‌టుడిగా, క‌మెడియెన్ త‌న‌దైన ముద్ర వేశారు. త‌మిళంలో వంద‌కుపైగా చిత్రాల్లో న‌టించారు. లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్‌తో ఆయ‌న‌కు చ‌క్క‌టి అనుబంధం ఉంది. దీంతో క‌మ‌ల్ హీరోగా తెర‌కెక్కిన‌ అపూర్వ స‌గోద‌ర‌గ‌ళ్‌, మైఖేల్ మ‌ద‌న కామ‌రాజు, గుణ‌, చాచి 420, అన్బేశివం, స‌త్య‌, విక్ర‌మ్ సినిమాల్లో న‌టించిన శివాజీ త‌నదైన శైలిలో కామెడీ పండించారు. శివాజీ న‌టించిన చివ‌రి సినిమా ‘లక్కీమ్యాన్‌’. ఇది సెప్టెంబర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే..

ఆర్ఎస్ శివాజీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన ‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి’ చిత్రంలో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో మాలోకం అనే కానిస్టేబుల్ పాత్ర‌లో ఆయ‌న నవ్వులు పూయించారు. సాయి ప‌ల్ల‌వి న‌టించిన ‘గార్గి’ చిత్రంలో శివాజీ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ప‌లు డ‌బ్బింగ్ సినిమాల ద్వారానూ ఆయ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించారు. సినిమాలే కాకుండా ప‌లు టీవీ సీరియ‌ల్స్‌లోనూ ఆయ‌న న‌టించారు.

Chiranjeevi : ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీకి ఇంకో సినిమా ఇచ్చిన మెగాస్టార్..? ఆ నిర్మాతని ఆదుకోవడానికేనా?