Prabhas: సలార్ షూటింగ్‌ను అప్పుడే ప్రారంభించనున్న ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో సలార్ మూవీ ఇప్పటికే ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Prabhas: సలార్ షూటింగ్‌ను అప్పుడే ప్రారంభించనున్న ప్రభాస్..?

Prabhas To Start Salaar Shooting From This Time

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో సలార్ మూవీ ఇప్పటికే ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Prabhas : బాహుబలితో భేటీ కానున్న అమిత్ షా.. అందుకోసమే..

కాగా, ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను నేటి నుంచి తాజా షెడ్యూల్ షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. అయితే ప్రభాస్ పెద్దనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల మృతిచెందడంతో ప్రభాస్ ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో సలార్ చిత్ర షూటింగ్‌ను తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ సలార్ చిత్ర షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు కాస్త సమయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Prabhas: కృష్ణంరాజు చివరి కోరికను తీర్చలేకపోయిన ప్రభాస్.. అది ఏమిటంటే?

అక్టోబర్ నెలలో సలార్ చిత్ర షూటింగ్‌లో తిరిగి ప్రారంభించేందుకు ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడట. అటు మేకర్స్ కూడా ఈ కష్టకాలంలో ప్రభాస్‌కు కాస్త సమయాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో చూడాలి.