Prabhas : బాహుబలితో భేటీ కానున్న అమిత్ షా.. అందుకోసమే..

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఘనంగా నిర్వహించబోతోంది. దీనికి ముఖ్య అతిధిగా అమిత్ షా రానున్నారు. అయితే ఒకరోజు ముందే వచ్చి బీజేపీ నేతలతో సమావేశం అవ్వనున్నారు. ఇక ఇటీవలే ప్రభాస్..............

Prabhas : బాహుబలితో భేటీ కానున్న అమిత్ షా.. అందుకోసమే..

amit shah will meet hero prabhas on september 16th

Prabhas :  ఇటీవల బీజేపీ నేతలు టాలీవుడ్ హీరోలతో వరుసగా సమావేశం అవుతున్నారు. టాలీవుడ్ హీరోలతో బీజేపీ నేతల సమావేశాలు రాజకీయాల్లో సరికొత్త చర్చలకు దారి తీస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అగ్ర నేతలు ఎన్టీఆర్, నితిన్ ని మీట్ అవ్వగా త్వరలో నిఖిల్ ని కూడా కలుస్తారు అని వార్తలు వస్తున్నాయి. తాజాగా బీజేపీ అగ్రనేత, దేశ హోంమంత్రి అమిత్ షా ప్రభాస్ ని కలవనున్నట్టు సమాచారం.

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఘనంగా నిర్వహించబోతోంది. దీనికి ముఖ్య అతిధిగా అమిత్ షా రానున్నారు. అయితే ఒకరోజు ముందే వచ్చి బీజేపీ నేతలతో సమావేశం అవ్వనున్నారు. ఇక ఇటీవలే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు బీజేపీ నేత, ఆయన గతంలో వాజ్ పేయ్ హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఇక సెప్టెంబర్ 16నే కృష్ణంరాజు గారి సంస్మరణ సభ నిర్వహిస్తుండటంతో అమిత్ షా ఆ రోజే వెళ్లి ప్రభాస్ ని పరామర్శించనున్నారు.

Bandla Ganesh : మా పవన్ కళ్యాణ్ ని చూసి నేర్చుకోండి.. యువ హీరోలకి కౌంటర్ వేసిన బండ్ల గణేష్..

దీంతో అమిత్ షా-ప్రభాస్ సమావేశం కూడా తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారింది. అయితే కృష్ణంరాజు బీజేపీ నేత కాబట్టి ప్రభాస్ ని మాత్రం కేవలం పరామర్శించడానికి, అలాగే కృష్ణంరాజుకి నివాళులు అర్పించడానికి మాత్రమే ఈ సమావేశం అని తెలుస్తుంది.