Bandla Ganesh : మా పవన్ కళ్యాణ్ ని చూసి నేర్చుకోండి.. యువ హీరోలకి కౌంటర్ వేసిన బండ్ల గణేష్..
తాజాగా బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారగా నెటిజన్లు బండ్లన్నని ట్రోల్ చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి.....................

Bandla Ganesh tweet with comparing young heros and pawan kalyan
Bandla Ganesh : నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి ఎంతటి వీరాభిమానో అందరికి తెలిసిందే. స్టేజి ఎక్కి మైక్ పట్టుకుంటే పవన్ గురించి ప్రసంగాలు చెప్తాడు. ఇక పవన్ గురించి పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటాడు బండ్ల గణేష్. ఒక్కోసారి వేరే వాళ్ళని పవన్ తో కంపేర్ చేస్తూ చూసి నేర్చుకోండి అంటూ వేరే హీరోల ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే ట్వీట్స్ కూడా చేస్తాడు.
తాజాగా బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారగా నెటిజన్లు బండ్లన్నని ట్రోల్ చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి యువ హీరోలు నాగ చైతన్య, అడివిశేష్, సిద్ధూ జొన్నలగడ్డ అతిధులుగా వచ్చారు. అక్కడ ఈవెంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవడం, అందరూ యువ టీం కావడం, సీట్స్ కూడా పెద్దగా, కంఫర్ట్ గా ఉండటంతో ఆ యువ హీరోలు కాళ్ళు పైకి పెట్టుకొని కంఫర్ట్ గా కూర్చున్నారు.
బండ్ల గణేష్ ఆ యువ హీరోలు కూర్చున్న ఫోటోని, పవన్ ఒక ఆడియో ఫంక్షన్ లో పద్దతిగా కూర్చున్న ఫోటోని షేర్ చేస్తూ.. ‘నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర పవన్ కళ్యాణ్ దయచేసి నేర్చుకోండి, ఆచరించండి అది మన ధర్మం’ అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇక నెటిజన్లు వాళ్ళేదో కంఫర్ట్ గా, సరదాగా కూర్చుంటే అక్కడెవ్వరికి లేని బాధ నీకెందుకు అంటూ కౌంటర్లు వేస్తున్నారు. మీ హీరోని పైకి లేపడానికి వేరే హీరోలని తగ్గించాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి ఈ ట్వీట్ పై ఆ యువ హీరోలు కానీ, వచ్చే ట్రోల్స్ కి బండ్లన్న కానీ స్పందిస్తారేమో చూడాలి.
నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర దయచేసి నేర్చుకోండి ఆచరించండి అది మన ధర్మం @PawanKalyan ? pic.twitter.com/3nkOVsMIor
— BANDLA GANESH. (@ganeshbandla) September 13, 2022