Naga Chaitanya : థియేటర్ ఏమైపోతుంది అన్నారు.. నాతో అయిదు నిమిషాల ఫైట్ చేసే క్యారెక్టర్ నుండి ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..

ఇటీవల కొన్ని రోజులు వరుస ఫ్లాప్స్, థియేటర్స్ కి జనాలు రాకపోవడం తో టాలీవుడ్ చర్చల మీద చర్చలు జరిపింది. తాజాగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య ఈ విషయంపై మాట్లాడారు. నాగచైతన్య మాట్లాడుతూ..................

Naga Chaitanya : థియేటర్ ఏమైపోతుంది అన్నారు.. నాతో అయిదు నిమిషాల ఫైట్ చేసే క్యారెక్టర్ నుండి ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..

Naga Chaitanya comments on Tolywood Issues

Naga Chaitanya :  సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ కానుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి నాగచైతన్య, సిద్ధూ జొన్నలగడ్డ, అడివిశేష్ ముఖ్య అతిధులుగా వచ్చారు.

ఇటీవల కొన్ని రోజులు వరుస ఫ్లాప్స్, థియేటర్స్ కి జనాలు రాకపోవడం తో టాలీవుడ్ చర్చల మీద చర్చలు జరిపింది. తాజాగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య ఈ విషయంపై మాట్లాడారు. నాగచైతన్య మాట్లాడుతూ.. ”ఇటీవల థియేటర్‌ ఏమైపోతోంది? ప్రేక్షకులు వస్తారా రారా? అంటూ అందరూ భయపడ్డారు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు సినిమా థియేటర్‌కి వచ్చి కచ్చితంగా సినిమాని చూస్తారు. ఈ మధ్య కొన్ని సినిమాలు మంచి కంటెంట్ తో వచ్చి నిరూపించాయి. ఈ సినిమా కూడా ట్రైలర్ చూస్తుంటేనే చాలా బాగుంది. కచ్చితంగా ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది” అని అన్నారు నాగచైతన్య.

Shree Karthick : అల్లు అర్జున్ తో సినిమా చేస్తా.. దానికోసం ఐదేళ్లయినా సరే ఎదురు చూస్తా..

ఇక ఈ సినిమా టీం గురించి మాట్లాడుతూ.. ”హీరో సుధీర్ బాబు ఏ మాయచేసావే సినిమాలో ఒక 5 నిమిషాల క్యారెక్టర్ నాతో ఫైట్ చేసే సీన్ లో కనిపించాడు. ఇప్పుడు హీరోగా అన్ని రకాల క్యారెక్టర్స్ చేయగలిగే నటుడిగా మారాడు. అతన్ని చూసి గర్విస్తున్నాను. ఇంద్రగంటి గారితో వర్కింగ్ బాగుంటుందని చాలా మంది చెప్పారు. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటున్నాను. కృతితో ఆల్రెడీ ఒక సినిమా చేశాను. ఇంకో సినిమా చేస్తున్నాను. తను చాలా హార్డ్ వర్కర్. సినిమా అంతా నోట్స్ రాసుకుంటుంది. హోమ్ వర్క్ చేస్తుంది తన క్యారెక్టర్ గురించి. తక్కువ టైంలోనే ఇన్ని సినిమాలు చేస్తుంది. భవిష్యత్తులో కృతి కచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుంది” అని తెలిపారు నాగచైతన్య.