Shree Karthick : అల్లు అర్జున్ తో సినిమా చేస్తా.. దానికోసం ఐదేళ్లయినా సరే ఎదురు చూస్తా..
'ఒకే ఒక జీవితం' సినిమా సక్సెస్ అవ్వడంతో దర్శకుడిని అంతా అభినందిస్తున్నారు. సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా దర్శకుడు శ్రీ కార్తీక్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశాడు. ఇంటర్వ్యూలో శ్రీ కార్తీక్ మాట్లాడుతూ..............

Oke Oka Jeevitham Movie Director Shree Karthick wants to direct Allu Arjun
Shree Karthick : శర్వానంద్ హీరోగా అమల ముఖ్య పాత్రలో టైం ట్రావెల్ కథకి అమ్మ సెంటిమెంట్ జోడించి వచ్చిన సినిమా ‘ఒకే ఒక జీవితం’. ఇటీవల విడుదలయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. సినిమా చూసిన ప్రేక్షకులని అమ్మ సెంటిమెంట్ తో కన్నీళ్లు తెప్పించి మనసుకి హత్తుకునేలా చేస్తుంది. తమిళ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు తెరకెక్కించిన శ్రీ కార్తీక్ ఈ ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో ఒకేసారి తెలుగు, తమిళ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు.
‘ఒకే ఒక జీవితం’ సినిమా సక్సెస్ అవ్వడంతో దర్శకుడిని అంతా అభినందిస్తున్నారు. సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా దర్శకుడు శ్రీ కార్తీక్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశాడు. ఇంటర్వ్యూలో శ్రీ కార్తీక్ మాట్లాడుతూ..”నా నెక్స్ట్ సినిమా తెలుగులోనే ఉంటుంది. ప్రస్తుతం కథ మీద వర్క్ చేస్తున్నాను. ఎప్పటికైనా అల్లుఅర్జున్ తో సినిమా చేయాలనేది నా కోరిక. నా దగ్గర ఉన్న ఓ ఫాంటసీ కథని ఆయనకి వినిపించాలి. మా కుటుంబంలో అందరూ అల్లు అర్జున్ కి అభిమానులే. ఆయనతో సినిమాకోసం నేను ఐదేళ్లు వెయిట్ చేయడానికైనా రెడీనే. నా కెరీర్‌లో తక్కువ సినిమాలు చేసినా పర్లేదు కానీ అవి మంచి సినిమాలై ఉండాలి” అని తెలిపారు.